రాదే శ్యామ్‌లో విక్రమ్ ఆదిత్య సినిమాలోనే కాదు రియల్ గా ఉన్నాడుగా .. ఇంతకీ ఆ క్రేజీ హీరో ఎవరంటే..?

Amruth kumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ మూవీ భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చింది  .. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలని అందుకోలేకపోయింది .. ఇక ఈ సినిమాల్లో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది .. ఇక ఈ మూవీలో ప్రభాస్ జాతకాలు తెలిసిన వ్యక్తిగా హస్తముద్రిక నిపుణుడిగా నటించాడు. ఎవరి చేయి చూసి ఎంతటి వారి భవిష్యత్తును అయినా కచ్చితంగా అంచనా వేసే వ్యక్తిగా ప్రభాస్ నటించారు. కథపరంగా ఈ సినిమా బాగానే ఉంటుంది కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు  విఫలమయ్యారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే రియల్ లైఫ్ లో ఆ విధంగా ఆస్ట్రాలజీ తెలిసిన ఓ స్టార్ హీరో ఒకరు ఉన్నారు ..

ఇక ఇంత‌కి ఆయన మరెవరో కాదు ప్రస్తుతం విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాన్ ఇండియా లెవెల్ లో రాణిస్తున్న సీనియర్ నటుడు జగపతిబాబు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు తనకు జ్యోతిష్యం గురించి తెలుసని ఓపెన్ గా గా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో మీకు జ్యోతిష్యం తెలుసు కదా అని యాంకర్ ప్రశ్నించగా .. జగపతిబాబు దానికి సమాధానం ఇస్తూ చిన్నతనంలోనే జ్యోతిష్యానికి సంబంధించిన విద్య నేర్చుకున్నానని రెండుసార్లు జ్యోతిష్యం కూడా చెప్పా ఆ రెండుసార్లు కూడా విషాదమే జరిగిందని చెప్పాడు .. ఆ విషాదాలు చెప్పినవి చెప్పినట్లు కూడా జరిగాయని .. అలాంటి విషాదాలు ముందే చెప్పాల్సి రావటం అవి జరుగుతుండడంతో ఇక జ్యోతిష్యం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నట్లు జగతిబాబు చెప్పుకొచ్చారు.

అలానే మనిషికి జ్యోతిష్యం అవసరం లేదని అనిపించింది .. కాలమే ఏదో ఒక సమయంలో మనిషికి అన్ని చెబుతుంది .. అలాంటప్పుడు ముందే తెలుసుకోవడం ఎందుకు అని జగపతిబాబు అన్నారు. ఆ తర్వాత జ్యోతిష్యం జోలికి అసలు  వెళ్లలేదని అన్నారు .. అయితే రాధేశ్యామ్ సినిమాలో జగపతిబాబు కూడా ఒకీలక పాత్రలో నటించారు ప్రభాస్ చేత తన జాతకం చెప్పించుకునే బిలీనియర్ పాత్రలో జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే. కానీ రియల్ లైఫ్ లో ఆయనకి ఆ విద్య తెలియడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: