ఎన్టీఆర్ సినిమాకు ఏడాది పాటు సెన్సార్ చేయలేదు .. ఇందిరా గాంధీకే చుక్కలు చూపించిన సినిమా..!
ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాగా తీస్తాను అంటే కాదు అనేవారు ఎవరైనా ఉంటారా ? కానీ అప్పటికే ఎన్నో మాస్ కమర్షియల్ లాంటి సినిమాలు వస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక ఆధ్యాత్మికంతో కూడిన సినిమా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అని అనుమానం మాత్రం కొందరిలో ఉండేది. ఇక విషయం ఏదైనా ఎన్టీఆర్ తలుచుకున్నాక ఆ పని ఆగదు .. ఈ సినిమాను ఆయనే సొంతంగా తెరకెక్కించారు విడుదలైన ఆరు రోజుల్లోనే కోటి రూపాయలు, లాంగ్ రన్ లో 6 కోట్ల రూపాయలకు కలెక్షన్లు రాబట్టింది .. అయితే ఈ సినిమాను తమిళనాడులో కూడా విడుదల చేయాలనుకున్నారు .. అప్పటికి తెరమీద బొమ్మలు పాలన చేస్తాయి అన్న మాటకు ఎంజి రామచంద్రన్ ఉదాహరణగా నిలిచారు.
ఆయన ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఉన్నారు. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ సినిమాపై దృష్టి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన ప్రభంజనం కూడా తెలుసుకున్నారు .. దాంతో తమిళనాడులో ఈ సినిమాను విడుదల చేయకూడదని ఆమె కంకణం కట్టుకున్నారు అలా ఏడాది పాటు సెన్సార్ జరక్కుండా ఈ సినిమా విడుదల కాకుండా ఆపారు. కానీ ఆ తర్వాత ఎన్నో రోజులు ఆపలేరు .. కాబట్టి చివరికి ఈ సినిమా విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆయన నిజంగానే ఆ తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసి తొమ్మిది నెలలకే తెలుగువాడి అభిమానం అనే మాటతో అభిమానుల మనసులు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు.