బుల్లి పిట్ట: కేవలం రూ.3.47 లక్షలకే కారు.. ఏకంగా 1200 కి. మి..!

frame బుల్లి పిట్ట: కేవలం రూ.3.47 లక్షలకే కారు.. ఏకంగా 1200 కి. మి..!

Divya
ప్రముఖ చైనీస్ ఆటోమొబైల్ కంపెనీకి చెందినటువంటి బెస్ట్యూన్ కంపెనీకి చెందినటువంటి ఎలక్ట్రికల్ కార్ని రిలీజ్ చేశారు. ఈ కారు లాంచ్ అయిన వెంటనే వార్తలలో ఎక్కువగా నిలిచింది. అసలు కారణం ఈ కారులో అదిరిపోయే ఫీచర్స్ తో పాటు ధర కూడా తక్కువగా ఉన్నది.. నిజానికి కంపెనీ బ్యాటరీ కి సంబంధించిన సాంకేతిక సైతం స్వయంగా సృష్టించిందట .త్వరగా చార్జ్ అవ్వడమే కాకుండా అదిరిపోయే రేంజ్ లో మైలేజ్ ఇవ్వడంతో పాటు కస్టమర్లను కూడా బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉన్నది.ఇప్పుడు ఈ టెక్నాలజీ తోనే షియోమీ నుంచి  ఓకే ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేయడం జరిగింది.
బెస్ట్యూన్ కారు ధర సుమారుగా రూ.3.47 లక్షల నుంచి..5.87 లక్షల వరకు ఉంటుందట. ఈ కారు కంపెనీ మైక్రో ఈవీ విభాగంలో భాగమైనట్లుగా సమాచారం. ఈ మైక్రో ఎలక్ట్రానిక్ కార్లకు చైనాలో భారీ డిమాండ్ ఉన్నదట. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఇండియన్స్ కూడా ఈ లాంటి కార్ల కోసం చాలా ఎదురు చూస్తున్నారు. టాటా టియాగో ఈవి, ఎంజి కామేట్ వంటి కార్లతో పోటీ పడబోతుందట.

కారు ఫీచర్స్ విషయానికి వస్తే:
ఏడు అంగుళాల యూనిట్ డాష్ బోర్డు కలిగి ఉంటుందట.. డ్యూయల్ టోన్ థీమ్ కలిగి ఉంటుందని.. షియోమీ నుంచి నేరుగా కనిపించే డ్యూయల్ టోన్ కలర్ స్క్రీన్ ని మనం ఇందులో చూడవచ్చు. ప్రొఫైల్ కోసం రౌండ్ కార్నర్స్ యొక్క పెద్దగా రెండు హెడ్ల్యాంపులను కూడా అమరిచారట... ఇందులో ఏరో డైనమిక్ వీల్స్ ను సైతం ఉపయోగించగా ఇవి వెహికల్ రేంజ్ ను మరింత పెంచేలా సహాయపడతాయట..బెస్ట్యూన్ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1200 కిలోమీటర్ల రేంజ్ లో వెళుతుందట. A1,A2 వంటి ఫార్మేట్లతో కలదట.2700-2850 MM వీల్ బేస్మెంట్ ని కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: