' పుష్ప 2 ' అడ్వాన్స్ బుకింగ్స్... షాకింగ్ ఫిగర్స్... !
అంటే 65 కోట్లు ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ ఇప్పుడే ఓపెన్ కావడంతో.. ఆ లెక్కలు రావాల్సి ఉంది.. అలాగే స్పెషల్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు. అవి ఈరోజు ఓపెన్ అవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రీమియర్లతో కలిపి మొదటి రోజు రు. 150 కోట్లు దాకా వస్తుందని చెప్తున్నారు. కొంచెం అటు ఇటు అదే అంకె ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలలో ప్రీమియర్ కోసం అత్యంత వేగంగా ఇక్కట్లు అమ్ముడుపోయిన సినిమాగా పుష్ప 2 రికార్డుల్లోకి ఎక్కింది. సినిమా రిలీజ్ కు మరో రెండు రోజుల టైం ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12,000 స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు.
ఇండియాలో 6500 స్క్రీన్లు .. ఓవర్సీస్ లో మరో 5500 స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. అలాగే పుష్ప 2 ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటలలోపు 4.0 మిలియన్ల వ్యూస్ పొందిన ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ట్రైలర్ గా కూడా రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఈ సినిమాకు రిలీజ్ కి ముందే 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డిసెంబర్ 4 రాత్రి సెకండ్ షో నుంచి అల్లు అర్జున్ పుష్ప రూల్ మొదలైపోతుంది.