పుష్ప -2: ఆంధ్రాలో భారీగా పెరిగిన టికెట్ ధరలు.. ఎంతంటే..?
ఇప్పటికే పుష్ప-2 సినిమాకి సంబంధించి భారీ ఈవెంట్స్ తో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లను చేశారు. నిన్నటి రోజున హైదరాబాదులో కూడా చాలా గ్రాండ్గా చేశారు చిత్ర బృందం. రెండు తెలుగు రాష్ట్రాల టికెట్లకు కూడా భారీగా డిమాండ్ పెరిగిపోయింది. తెలంగాణలో నిర్ణయించగా .. తాజాగా ఏపీలో టికెట్లు నిన్నటి రోజున రాత్రి ధరలను పెంచుకునే సదుపాయాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.. అందుకు గాను అల్లు అర్జున్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ,అటు ఏపీ సీఎం చంద్రబాబుకు సైతం ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఫీట్ చేయడం జరిగింది.
పుష్ప-2 చిత్రానికి గాను పెరిగిన టికెట్ల రేట్ల విషయానికి వస్తే డిసెంబర్ 4 రాత్రి 9:30 ప్రీమియర్ షోకు 800 రూపాయల వరకు పెంచుకునేలా సదుపాయం కల్పించారు..
డిసెంబర్-5 అన్ని స్క్రీన్లలో ఆరు షోలకు అనుమతి ఇస్తూ సింగిల్ స్క్రీన్ కి 150 రూపాయలు లోయర్ క్లాస్ కు 100 రూపాయలు మల్టీప్లెక్స్ లకు 200 పెంచుకునేలా సదుపాయాన్ని కల్పించారు.
డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చారు.. సింగిల్ స్క్రీన్స్కు అప్పర్ క్లాస్కు 150 రూపాయలు.. లోయర్ క్లాస్ కు వంద రూపాయలు మల్టీప్లెక్స్ లలో 200 రూపాయలను పెంచుకునే సదుపాయాన్ని కల్పించారు. మొత్తానికి పుష్ప-2 సినిమా టికెట్ల విషయంలో చిత్ర బృందానికి గుడ్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.