చిరంజీవి కెరీర్ లో బెస్ట్ పొలిటికల్ మూవీ గాడ్ ఫాదర్.. ఆ సీన్స్ లో అదరగొట్టారుగా!
చిరంజీవి యాక్టింగ్ కు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నయనతార చిరంజీవి సోదరి పాత్రలో కనిపించగా ఆమె కూడా తమ నటనతో అదరగొట్టారు. చిరంజీవి ఈ సినిమాలో వయస్సుకు తగిన పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబోలో తెరకెక్కిన విశ్వంభర మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా ఈ సినిమా మార్చి నెలలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నెక్స్ట్ లెవెల్ లో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను త్వరలో ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ లు సైతం భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి.
విశ్వంభర సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా కోసం యూవీ బ్యానర్ నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేశారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి క్రేజ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.