టాలీవుడ్ నుంచి కీర్తి సురేష్ పెళ్లికి అటేండ్ కాబోతున్న ఏకైక తెలుగు హీరో ఇతడే ... సో సో స్పెషల్..!?
తన బాయ్ ఫ్రెండ్ నే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు. ఓ ప్రముఖ పత్రిక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కన్ఫర్మ్ చేశారు . అంతేకాదు డిసెంబర్ 11, 12వ తేదీల్లో కీర్తి సురేష్ పెళ్లి గోవాలో ప్రైవేట్ రిసార్ట్లో జరగబోతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు హాట్ హాట్ గా వైరల్ అవుతూ ట్రెండ్ అవుతుంది.
అయితే కీర్తి సురేష్ పెళ్లికి చాలా దగ్గర మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారట . సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా చాలా తక్కువ మంది హాజరు కాబోతున్నారు . వాళ్ళ సెక్యూరిటీ భద్రతా దృష్ట్యా ఎవరిని ఈ పెళ్లికి పిలవడం లేదట. కీర్తి సురేష్ దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ ని మాత్రమే పిలుస్తున్నారట . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కీర్తి సురేష్ ఒకే ఒక హీరోకి ఆహ్వాన పత్రిక అందజేసిందట . ఆయన మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని .