నందమూరి కుటుంబానికి విజయశాంతికి ఉన్న.. రెండు బంధుత్వాలు గురించి మీకు తెలుసా..?

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి అనే చెప్పాలి. ప్రధానంగా అప్పట్లో ఉన్న స్టార్ హీరోలకు దీటుగా ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించి హీరోలకు ఏం మాత్రం తక్కువ కాదని నిరూపించింది విజయశాంతి. ఎలాంటి స్టార్ హీరో అవసరం లేకుండా హీరోలకు దీటుగా రానించి విజయం సాధించిన ఏకైక హీరోయిన్ కూడా ఈవిడే.

చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయాలు అందుకున్న విజయశాంతి.. 1976 జూన్ 24న తెలంగాణ వరంగల్లో జన్మించింది. ఆ తర్వాత ఆమె మద్రాస్ లో పెరిగారు. ఇక విజయశాంతి పిన్ని విజయ లలిత అప్పట్లో సినిమాల్లో కూడా నటించారు. అలాగే ఈమె అసలు పేరు శాంతి తన పిన్ని పేరులోని విజయ లలిత పేరు నుంచి విజయాని తీసుకున్నారు .. అలా విజయశాంతి అనే పేరు వచ్చింది .. అలాగే ఈమె ఏడు సంవత్సరాల వయసులోనే బాలనటిగా సినిమాల్లో అడుగుపెట్టారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో కిలాడీ కృష్ణుడు సినిమాలో తొలిసారిగా వెండి తేరపై నటించింది. అలాగే ఆ సినిమాకి కృష్ణ భార్య విజయనిర్మల దర్శకత్వం వహించారు.

అలాగే తన సినీ కెరియర్ మొదట్లో కేవలం గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు విజయశాంతి. ఆ తర్వాత తిరుగులేని స్టార్ హీరోయినిగా మారారు. ఇక 1987 లో మోటూరి శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విజయశాంతి. నందమూరి హీరో బాలకృష్ణ ద్వారా శ్రీనివాస్ ఆమెకు పరిచయం అయ్యాడు .. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆమె మేనేజర్ గా కూడా పనిచేశారు. శ్రీనివాస్ కి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో బంధుత్వం ఉంది. ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు సొంతం మేనళ్లుడు శ్రీనివాస్. అలాగే ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఫ్యామిలీతో కూడా ఆయనకు చుట్టరికం ఉంది. విజయశాంతి భర్త కి  ఎన్టీఆర్ ఫ్యామిలీతో రెండు వైపులా బంధుత్వం ఉంది. విజయశాంతి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. మళ్లీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ 21వ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: