రివ్యూల‌ను ఆపేస్తే.. రివ్యూవ‌ర్ల‌కు వార్నింగ్ ఇస్తే సినిమాలు హిట్ట‌వుతాయా ?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

సరిగ్గా ఆడటం రాక మద్దెల‌ సరిగ్గా వాయించలేదు అన్నారట వెనకటకు ఒక నాట్య కళాకారిణి. ఇప్పుడు అన్ని సినిమా రంగాల పరిస్థితి అలాగే ఉంది. రివ్యూ చెప్పకూడదంటూ ఆదేశాలు తెచ్చుకోవడం ఆడియన్స్ అభిప్రాయాలు తీసుకోవటానికి థియేటర్లకు రాకుండా చేయాలని ప్రయత్నాలు తమిళనాట ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకుల దగ్గర నుంచి థియేటర్ ఆవరణలోకి వచ్చి సినిమా చూసి వస్తున్న ప్రేక్షకుడి అభిప్రాయం తీసుకోకూడదు.. అలా వచ్చే యూట్యూబ‌ర్ల‌ను లోప‌ల‌కు రానివ్వకూడదు. సరే థియేటర్లలోకి రానివ్వరు.. దగ్గర్లోని టీ బంక్ ... దగ్గరలో ఫుట్పాత్ మీద ఉంటే దాన్ని అడ్డుకుంటారా సరే ఇవన్నీ ఆపేస్తారు .. ఫేస్బుక్లో ... వాట్సాప్ లో ఎవరికి వారు వ్యక్తిగతంగా పంపుకునే మౌత్‌ టాక్ ను కూడా ఆపేయగలరా ? బాగాలేని సినిమాలకు ఏవీ బాగుండవు .. బాగున్న సినిమాకు అన్ని బాగుంటాయి అన్న‌ది వాళ్ల‌కు తెలియ‌దా..!

మహారాజా - సత్యం సుందరం సుమారు బాగున్నాయనే కదా అందరూ అన్నారు. ఈ దీపావళికి మూడు సినిమాలు వస్తే మూడు బాగున్నాయి.. కదా రివ్యూవర్లు బాగాలేదని చెప్పిన తర్వాత కూడా సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి. అలా హిట్ అయిన సినిమాలు ఓటిటీ లో విడుదయ్యాక‌ జనం నుంచి ఇవేం సినిమాలు ఎలా ఆడాయి ? అని అనిపించుకున్నవి ఉన్నాయి .. ఇవన్నీ తెలియని సంగతులు కావు. సినిమా జనాలకు.. సినిమా తీసే వాళ్లకు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నింద లేనిదే బొందిలో ప్రాణం పోదు అని సామెత. సినిమాలు ప్లాప్ అయితే చెప్పుకోవటానికి ఏదో ఒక సాకు కావాలి.

ఎవరి మీద ఆ నెపం వేసుకోవాలి .. హీరో వేసుకుంటారా ? హీరోయిన్ మీద వేస్తారా లేదా నిర్మాత అకౌంట్లో పడుతుందా ? అందుకే ఇలా అభిప్రాయం చెప్పే వాళ్ళ మీద నెట్టేస్తే సరిపోతుంది అని .. కోలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తున్నట్టు ఉంది. అసలు రివ్యూలు ... సోషల్ మీడియా లేని టైంలో కూడా డిజాస్టర్లు చాలా ఘోరమైన డిజాస్టర్లు ఉన్నాయన్న సంగతి సినిమా వాళ్లు మర్చిపోతున్నారు. కానీ డిజిటల్ కాలంలో ఇవేవీ వర్కౌట్ కావు అన్న సంగతి ఆలస్యంగా అయినా గ్రహిస్తారు .. ఇవన్నీ మానేసి కాంబినేషన్లు నమ్ముకోకుండా బలమైన క‌థ‌, కథనాలు నమ్ముకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: