నేషనల్ వైడ్‌గా ' పుష్ప 2 ' క్రేజ్.. నభూతోః నభవిష్యత్... !
పుష్ప 2 ఈ సినిమా గురించి కొత్తగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. గత మూడు సంవత్సరాలుగా కొన్ని కోట్ల కళ్ళు ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు ? థియేటర్లోకి వస్తుందా ? అని ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి. ఫ్యాన్స్ కు పూనకాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కెట్ చేశారు. ఇక డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కావటం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయలు పుష్ప 2 ప్రచారానికి ఖర్చు కాబోతుంది. పైగా ఈ రు. 150 కోట్లు ఖర్చు చేస్తున్నది నిర్మాతలు ఆయన మైత్రి మూవీస్ వాళ్ళు కాదు. దేశంలోని వివిధ కార్పొరేట్ సంస్థలు.
ఇటీవల బన్నీ టీం నుంచి ఓ వీడియో వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తొలిసారి ఇన్ని బ్రాండ్లు ఓ హీరో చేతిలోకి వచ్చాయి. ఇన్ని బ్రాండింగ్లో అంటూ ఓ పెద్ద లిస్టు వదిలారు. ఇప్పుడు ఈ బ్రాండింగ్ లో అన్ని పుష్ప 2 ప్రచారం నిర్వహించబోతున్నాయి. ఏ భాషలో ఏ ఛానల్ పెట్టినా పుష్ప 2 ప్రచారం కనిపిస్తుంది. ఏ పట్టణంలో ఏ హోర్డింగ్ చూసిన పుష్ప 2 ప్రచారం కల్పిస్తుంది. ప్రాంతాల వారీగా ... రాష్ట్రాలవారీగా జిల్లా కేంద్రాల వారిగా వివిధ సంస్థలకు వాటి బడ్జెట్ ప్రకారం ప్రచారంలో పాలుపంచు కోబోతున్నాయి. పుష్ప 2 సినిమాకు ఉన్న క్రేజ్ గుర్తించి కార్పోరేట్ సంస్థలు ఇలా ముందుకు వచ్చాయి. వాటికి ఉన్న పబ్లిసిటీ బడ్జెట్ తో పోల్చుకుంటే రు . 10 - 20 కోట్లు నథింగ్ అందుకే అన్ని సంస్థలు కలిపి 150 కోట్లు ప్రచారానికి పెట్టడం ఇంకా నథింగ్ అనుకోవాలి. ఏది ఏమైనా పబ్లిసిటీ విషయంలో పుష్ప 2 నభూతో ... న భవిష్యత్తు పుష్ప 2 పబ్లిసిటీ పెద్ద చరిత్ర సృష్టించబోతోంది.