వామ్మో: నెట్ ఫ్లిక్స్ తో అన్ని కోట్లు బేరం కుదుర్చుకున్న నయనతార..!

Divya
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన నయనతార రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ చిత్రం.."బియాండ్ ది ఫెయిరీ టెల్". ఆమె 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ డాక్యుమెంటరీని ప్రముఖ ఓటీటి ఛానల్ అయిన నెట్ ఫ్లిక్స్ ట్రిమ్మింగ్ చేయడం జరిగింది. అయితే ధనుష్ తో విభేదం కారణంగా ఈ డాక్యుమెంటరీకి రావలసిన పబ్లిసిటీ వచ్చిందని చెప్పవచ్చు. సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడం జరిగింది.బియాండ్ ది ఫెయిరీ టెల్ డాక్యుమెంటరీ నయనతార జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.

నయనతార కుటుంబ సభ్యులకు సంబంధించి కాలేజ్ డేస్ నుంచి అలాగే మోడలింగ్ ఆ తర్వాత హీరోయిన్ గా ఎలా ఎదిగింది లేడీ సూపర్ స్టార్ గా ఎలా పాపులారిటీ సంపాదించుకుంది అలాగే తన భర్త విగ్నేష్ ఇవంతో ప్రేమాయణం పెళ్లి ప్రస్తుతం వారి లైఫ్ ఎలా ఉంది అని డాక్యుమెంటరీ రూపంలో చూపించారు. అయితే నయనతార డాక్యుమెంటరీ రూపొందించడానికి భారీగానే డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ సుమారుగా నయనతారకు 25 నుంచి 30 కోట్ల రూపాయలు చెల్లించినట్లు టాక్ వినిపిస్తున్నది.
ఇందులో భాగంగా నయన్ విగ్నేష్ దంపతులకు కూడా తమ వ్యక్తిగతమైన విషయాల ను తెలియజేసినట్లు తెలుస్తోంది. అందుకే పెళ్లి సమయంలో కూడా మీడియాని ఎక్కడ అనుమతించలేదు ఎటువంటి వీడియోలను కూడా వీరు బయట పెట్టలేదు. నయనతార డాక్యుమెంటరీ ని అమిత్ కృష్ణ డైరెక్షన్ వహించారు సుమారుగా 1:22 గంటల నిమిషాలతో తెరకెక్కించారట ఇందులో నయనతార తల్లి సోదరుడు భర్త విగ్నేష్ తో పాటు నాగార్జున, రానా, విజయ్ సేతుపతి ,రాధికా శరత్ కుమార్, తమన్నా ,తాప్సి తదితర సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి పాజిటివ్ వైపు తో నయనతార బయోపిక్ అయితే వైరల్ గా మారుతున్నది. కానీ నయనతార అన్ని కోట్ల రూపాయలు డీల్ కుదురుచుకుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: