"ఆ వార్త విని కడుపు మండిపోయింది"..సోషల్ మీడియాలో రూమర్ పై ఫస్ట్ టైమ్ స్పందించిన ప్రభాస్..!
అయితే సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో మనకి బాగా తెలుసు . మరి ముఖ్యంగా ఆయన పెళ్లి వార్త చాలా చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. ప్రభాస్ - అనుష్కల పెళ్లి గురించి ఎన్ని రకాల వార్తలు వింటూ ఉంటామో. మనకి బాగా తెలిసిందే . దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అయితే అన్ని రూమర్స్ ని ప్రభాస్ చూసి చూడనట్లు కొట్టి పడేస్తూ ఉంటారట . అయితే ఒక రూమర్ మాత్రం ప్రభాస్ ని బాగా మనసుకు గాయపరిచేలా చేసిందట .
కృష్ణంరాజు చనిపోయిన మూమెంట్లో కృష్ణంరాజు ఫ్యామిలీ ని ప్రభాస్ దూరం పెట్టేయబోతున్నాడని.. ఒక రాజకీయ నేత వల్ల ప్రభాస్.. కృష్ణంరాజు ఆస్తి మొత్తం తీసేసుకుని ఆ ఫ్యామిలీని దూరంగా పెట్టేస్తున్నాడు అని వార్త వినిపించింది. ఆ వార్త ప్రభాస్ అభిమానులు బాగా హర్ట్ చేసింది. అయితే ప్రభాస్ కూడా ఆ రూమర్ విని బాగా హర్ట్ అయ్యారట . పెదనాన్న అంటే మొదటి నుంచి ప్రభాస్ కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే . అలాంటి పెదనాన్న చనిపోతే ఆస్తి కోసం కుటుంబాన్ని వదిలేస్తానా..?అంటూ బాగా డీప్ గా తన ఫ్రెండ్స్ వద్ద బాధ పడ్డారట . అంతేకాదు మొదటినుంచి మంచి మనసు గల ప్రభాస్ ఆ రూమర్ పై బాధపడ్డాడే తప్పిస్తే ఎక్కడ అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసి జనాలపై సివియర్ రాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడలేదట. ఆ తర్వాత మళ్లీ తన లైఫ్ లో బిజీ అయిపోయారు ప్రభాస్. అంత మంచివాడు ప్రభాస్ అంటూ రెబెల్ ఫాన్స్ పొగిడేస్తున్నారు..!