కంగువని కావాలనే తొక్కేస్తున్నారు .. నెగిటివ్ రివ్యూల పై జ్యోతిక ఆన్సర్ అదిరిపోయింది గా..!

Amruth kumar
సౌత్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ మూవీ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెర్కక్కిన ఈ మూవీ విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా విభిన్న కథతో తెరకెక్కింది.. సినిమాల్లో కూడా సూర్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. కాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కంగువ సినిమాకు విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అలాగే సూర్య అభిమానులకు చాలామందికి కూడా కంగువ సినిమా నిరాశపరిచిందని కూడా వాళ్ళు అంటున్నారు. కానీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పించాయి. ఇక‌ ఇప్పుడు తాజాగా సూర్య భార్య జ్యోతిక కూడా కంగువ సినిమాపై తన రివ్యూ ఇచ్చారు. సినిమాల ఆ పార్ట్ బాలేదని ఆమె బహిరంగంగా చెప్పేశారు. ఇంతకు జ్యోతికకు తన భర్త సినిమా ఎలా అనిపించింది అనేది ఇక్కడ  చూద్దాం.

నేను ప్రధానంగా సూర్య భార్య‌గా కంటే .. ఓ సినిమా లవర్ గా కంగువ సినిమా రివ్యూ చెబుతున్న.. అందరూ చెప్పినట్టుగానే నిజంగా ఈ సినిమా ఓ గొప్ప అద్భుతం.. సూర్య మరోసారి తన నటనతో మెప్పించారు. ఈ విషయంలో నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే అందరూ అంటున్నట్టు ఈ సినిమా మొదటి అరగంట అనుకున్నంత స్థాయిలో లేదు. అదేవిధంగా సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది .. ఇది మాత్రమే మైనస్ చాలా సినిమాల్లో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి అలాంటిది .. ఇలాంటి గొప్ప ప్రయోగాత్మక సినిమాల్లో చిన్నచిన్న లోపాలు ఉండటం సహజం .. మూడు గంటలు ఉన్న సినిమా అందులో నచ్చినది అరగంట మాత్రమే.. నేను నా మనసుతో చెప్తున్నా ఇదొక గొప్ప అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిగా నాకు అనిపించింది.

ఇప్ప‌టివరకు సూర్య నటించిన సినిమాల్లో ఇలాంటి కెమెరా వర్క్ ఎందులోను నేను చూడలేదు .. ఇలాంటి గొప్ప సినిమాకు వస్తున్న నెగిటివ్ రివ్యూ చూసి షాక్ అయ్యా .. ఇంతకు ముందు వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి , సీన్స్ బాలేకున్న.. ఆడవారిని కించపరిచేలా డైలాగ్స్ ఉన్నా ఇలాంటి రివ్యూలు ఎక్కడా నేను  చూడలేదు. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ , మహిళలపై వచ్చే ఫైట్ సీన్స్ సన్నివేశాలు, చిన్నారిపై కంగువ‌ చూపించే ప్రేమ ఇలా చాలా ఉన్నాయి. వాటి గురించి ఎవ్వరూ ఎక్క‌డ‌ మాట్లాడటం లేదు .. నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్‌ మరిచిపోయినట్లు ఉన్నారు. విడుదలైన తొలి రోజు నుంచే ఇంత నెగెటివిటీని చూడటం బాధగా ఉంది. అద్భుతమైన సినిమాను తెరకెక్కించడానికి మూవీ టీమ్ చేసిన కృషిని మెచ్చుకోవలసిందే” అని జ్యోతికా అన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: