బిగ్ షాకింగ్: నయనతార పై పోలీస్ కేసు.. ధనుష్ రివేంజ్ దెబ్బ మొదలు పెట్టాడ్రోయ్..!?

Thota Jaya Madhuri
ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మిడియాని షేక్ చేసి పడేస్తుంది.  మనకు తెలిసిందే గతి 24 గంటల నుంచి సోషల్ మీడియాలో నయనతార అదేవిధంగా ధనుష్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . దానికి కారణం కూడా అందరికీ తెలుసు . నయనతార నెట్ ఫ్లిక్స్  లో తన వెడ్డింగ్ డాక్యుమెంటరీని ప్లాన్ చేసింది . దానికి సంబంధించిన పనులు కూడా చకచకా కంప్లీట్ చేసుకుంది. మొత్తంగా తానే దగ్గరుండి అన్ని విషయాలను చూసుకుంది . అయితే తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను వాడూకున్నందుకుగాను ఆమెపై సీరియస్ అవుతూ ధనుష్ ఏకంగా లీగల్ నోటీసు పంపిస్తూ పది కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారట .

ఈ విషయాన్ని నయనతార బయట పెట్టడంతో అంత షాక్ అయిపోతున్నారు . ధనుష్ కి పది కోట్లు ఒక మ్యాటరే కాదు . ఆయన ఎన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడు అనేది అందరికీ తెలిసిందే . కష్టపడి సంపాదిస్తూ బాగానే ఆస్తులు కూడ పెట్టుకున్నారు. కేవలం 10 కోట్ల కోసమే నయనతార కు లీగల్ నోటీసులు పంపించాడా అంటూ కోలీవుడ్ జనాలు మండిపడుతున్నారు . వీళ్లిద్దరి మధ్య ఏదో పాత పగలు ఉండనే ఉన్నాయి అవి ఇలా బయటపడ్డాయి అంటూ గుసగుసలాడుకుంటున్నారు. సరిగ్గా ఇదే మూమెంట్లో నయనతారపై ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య పోలీస్ కేసు పెట్టబోతుంది అంటూ ఓ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎలా అయితే నయనతార ..ధనుష్ పరువుని సోషల్ మీడియా వేదికగా తీసేసిందో అదే విధంగా నయనతార గతంలో చేసిన పనులకు సంబంధించిన విషయాలను బయటపెడుతూ ఐశ్వర్య తన మాజీ భర్త పరువును కాపాడేందుకు బాగా ట్రై చేస్తుందట . ఈ క్రమంలోనే  పోలీస్ కేసు పెట్టడానికి కూడా ఆమె వెనకాడడం లేదట . ఇప్పటికే తన లాయర్ టీం తో వర్క్ చేసి నయనతారపై ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి అంటూ ఎలాంటి కేసు పెట్టాలి అంటూ కూడా ఫైనల్ డిక్లరేషన్ కి వచ్చిందట.

త్వరలోనే నయనతారపై ఐశ్వర్య పోలీస్ కేసు పెట్టబోతుంది.. అంటూ కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . నయనతార పెట్టిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ధనుష్ పరువు తీసేయడమే కాకుండా ఇప్పుడు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఆమెపై రివేంజ్ కూడా తీర్చుకునేలా చేస్తుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఈ వ్యవహారం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదు అంటున్నారు జనాలు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: