"ఆ సినిమా నేను చేసుంటే ఇంకా బాగుండేదేమో..?"..ఇన్నాళ్లకు ఓపెన్ అప్ అయిపోయిన నాగార్జున..!
మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కారణంగా ఆయన పేరుని ఏ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురి చేశారో ఆకతాయిలు మనం చూసాం. అయినా కూడా రెస్పాండ్ అవ్వలేదు అక్కినేని నాగార్జున . అయితే నాగార్జున ఒక విషయాన్ని మాత్రం చాలా ఓపెన్ గా చెప్పేశాడు . సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా సరే ..ఆ సినిమాలో వేరే స్టార్ నటించి.. ఆ సినిమా హిట్ అయితే అబ్బబ్బ మనకి ఇలాంటి సినిమా పడితే ఎంత బాగుండో అనుకుంటారు. ఆ విషయాన్ని కొంతమంది బయటకు చెప్తారు. మరికొందరు తమలో తామే అనుకుంటూ ఉంటారు.
కానీ నాగార్జున మాత్రం ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు . ఒకానొక ఈవెంట్లో నాగార్జున "సంక్రాంతి" లాంటి సినిమా నాకు వచ్చుంటే చాలా బాగుండేది అని.. ఆ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యుండేవాడి ని అని నాగార్జున చెప్పుకొచ్చాడట. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ హీరో గా నటించారు . అంతేకాదు శివ బాలాజీ అదే విధంగా శర్వానంద్ ఆయనకు తమ్ముళ్లుగా కనిపిస్తారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎన్ని సార్లు చూసిన సరే బోర్ కొట్టవు.. తనవి తీరవు..!