కృష్ణంరాజు చివరి కోరిక అదేనా..? తన పర్సనల్ డైరీలో అలా రాసుకున్నాడా..?
ఆయన అనుకున్న పనిలో సక్సెస్ అయ్యాడు . సీనియర్ రోల్స్ లో కూడా కృష్ణంరాజు ఎంత అద్భుతంగా నటించాడొ మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా కూడా ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే వేయించుకున్నారు. కాగా కృష్ణంరాజు అనారోగ్య కారణంగా మరణించారు . ఆయన మరణాని ఇప్పటి కూడా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన మరణానికి సంబంధించిన పలు రకాల వార్తలు బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే కృష్ణంరాజుకి డైరీ రాసే అలవాటు ఉందట . ఆయన తన లైఫ్ లో జరిగిన ప్రతి విషయాని కూడా డైరీలో నోట్ చేసుకునే అలవాటు ఉందట. తన డైరీలో తన చివరి కోరికను కూడా రాసుకున్నారట . ఆయన మరణించే కరెక్ట్ గా నెల రోజులు ముందే ఆయన డైరీలో ప్రభాస్ పెళ్లి చూడాలి అంటూ ..ప్రభాస్ పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది అంటూ రాసుకొచ్చాడట . కానీ ఆయనకి ఆ కోరికే తీరలేదు. ప్రభాస్ పెళ్లి చూడకుండానే ఆయన మరణించాడు . కేవలం కృష్ణంరాజు మాత్రమే కాదు కోట్లాదిమంది జనాలు కూడా రెబల్ హీరో పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఆశ పడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అంటే సైలెంట్ గా ఉండిపోతూ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాడు. చూద్దాం మరి ఈ డార్లింగ్ తన పెళ్లి గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తాడో ఏమో..???