అమీర్ ఖాన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లి !
మృధు స్వభావిగా ఇండస్ట్రీ వర్గాలలో పేరున్న ఇతడు తీసే సినిమాలు కూడ చాల సాఫ్ట్ గా ఉంటూ ఉంటాయి. మహేష్ తో తీసిన ‘మహర్షి’ హిట్టయినప్పటికీ అతడికి మరో టాప్ హీరో విజయ్ నుండి పిలుపు రావడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పట్టింది. విజయ్ తో తీసిన ‘వారసుడు’ కూడ అంచనాలను అందుకోలేకపోవడంతో మళ్ళీ వంశీ పైడిపల్లికి గ్యాప్ వచ్చింది.
దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ దర్శకుడు మౌన ముద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఈ దర్శకుడు వార్తలలోకి వచ్చాడు. బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తో వంశీ ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు రావడం చాలామందికి షాక్ ఇస్తోంది. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఫ్లాప్ అయిన తరువాత షాక్ లోకి వెళ్ళిపోయిన ఈ బాలీవుడ్ టాప్ హీరో మరో సినిమాను ఒప్పుకోలేదు. తనకు తాను రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న అమీర్ ఖాన్ తీరి దర్శకులు చెపుతున్న కథలను వింటున్నట్లు టాక్.
ఈ క్రమంలో వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్ ను కలిసి ఒక సామాజిక చైతన్యంతో కూడిన కథను వినిపించనట్లు టాక్. ఆకథ అమీర్ ఖాన్ కు బాగా నచ్చడంతో ఆకథను డెవలప్ చేసి స్క్రిప్ట్ గా మార్చమని సూచించడంతో ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఆపనిలో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవిషయమై అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈవార్తలే నిజం అయితే ఈ దర్శకుడి పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయే ఆస్కారం ఉంది..