భర్త అంటే ఇలా ఉండాలి.. దిల్ రాజు పై ప్రశంసల వర్షం..!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు.. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈయన, అనతి కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. చిత్ర పరిశ్రమలో నిర్మాత అనే వాడికి విలువ తగ్గుతున్న దశలో ఆ స్థానానికి గౌరవం తెచ్చిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు అని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని నర్సింగాపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన ఈయన, అసలు పేరు వెంకటరమణారెడ్డి. మొదట తన సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1990లో డిస్ట్రిబ్యూషన్ వైపు అడుగు పెట్టారు.
జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లి పందిరి సినిమాతో పంపిణీదారుడిగా మారి, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2003లో వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాతో నిర్మాతగా మారి, తన మొదటి సినిమాని ఇంటిపేరుగా పెట్టుకున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 సినిమాల వరకు తీసి అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన బ్యానర్ లో వచ్చిన సినిమాలు 80% సక్సెస్ రేట్ అందుకున్నాయి అంటే ఇక  ఈయన జడ్జిమెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే నిర్మాతగానే కాదు ఒక భర్తగా కూడా టెస్టులో పాస్ అయ్యారు. మొదట అనిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు దిల్ రాజు. ఈ దంపతులకు హన్షితా రెడ్డి సంతానం. ఇక 2017లో గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. భార్య మరణంతో కృంగిపోయిన దిల్ రాజు.. కుమార్తె,  ఇతర పెద్దల ఒత్తిడి మేరకు 2020లో తేజస్విని ను వివాహం చేసుకున్నారు. ఈమె రాకతో తన జీవితం మలుపు తిరిగింది.ఒక కొడుకుకు జన్మనిచ్చిన వీరు.. వెకేషన్స్ కి , తీర్థయాత్రలకు వెళ్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు భార్య కెరియర్ పై కూడా దృష్టి పెట్టిన ఈయన.. ఈమె  ఉన్నత విద్యకు తోడ్పడ్డారు.  ఇటీవలే ఈమె తన భర్త సహకారంతో డిగ్రీని పూర్తి చేశారట. ఇక ఈ విషయం తెలిసి భర్త అంటే ఇలా ఉండాలి.. భార్యకు అన్నివేళలా సహాయంగా ఉండాలి అంటూ దిల్ రాజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: