"కంగువ" మూవీ ఫ్లాప్.. పార్టీ చేసుకుంటున్న తెలుగు ప్రొడ్యూసర్.. ఎందుకంటే..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అని చెప్పడానికి "కంగువ" మూవీ మరొక బిగ్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు జనాలు . కంగువ సినిమా కోసం సూర్య ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే.  అసలు తిండి నిద్ర కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు కొన్ని సంవత్సరాలు కష్టపడి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు . నేడు ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .


సూర్య నటన ఓకే.. కానీ డైరెక్టర్ రాసుకున్న కథ జనాలకు చెప్పడంలో విఫలమయ్యాడు అంటున్నారు జనాలు. అయితే సూర్య సినిమా ఫ్లాప్ అయింది అని తెలిసి ఓ తెలుగు ప్రొడ్యూసర్ భలే భలే ఆనందపడిపోతున్నాడట. దానికి కారణం ముందు నుంచి కంగువ సినిమాకు తెలుగులో థియేటర్స్ తక్కువగా కేటాయించడమే . ఆ స్టార్ ప్రొడ్యూసర్ కూడా "కంగువ" సినిమాకు థియేటర్స్ తక్కువగా ఉంటేనే బెటర్ అని.. మన తెలుగు సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలి అంటూ చాలా చాలా ట్రై చేశారట. తెర వెనుక చాలా కన్నింగ్ ప్లాన్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారట. మొత్తాని సూర్య సినిమాకి తక్కువ ధిఏటర్స్ ఇవ్వాలి అని బాగానే కష్టపడ్డాడు ఈ పేరు ఉన్న పెద్ద మనిషి.


ఫైనల్లీ అనుకున్నట్టే చేశాడు.  లాస్ట్ మినిట్ వరకు సూర్యని కంగువ సినిమా కి ధియేటర్స్ కెటాయించడంలో  బాగా టెన్షన్ పెట్టేశారు. ఫైనల్లీ "కంగువ" సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ ప్రొడ్యూసర్ పండగ చేసుకుంటున్నాడట. ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ కి మండిపోతుంది. మా సూర్య పై ఎందుకు రా పడి ఏడుస్తున్నారు..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. చూడాలి మరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ కంగువ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: