20 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్.. ఎక్కడ చూసినా కోట్లలో డబ్బు.. ఒక్క అబద్ధంతో కెరీర్ నాశనం..!
40 సంవత్సరాలు ఆమె చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఒకప్పటి హీరోయిన్ మాలా సిన్హా.. గతంలో బాలీవుడ్ లో స్టార్ నటి.. ఆ సమయంలో స్టార్ హీరోలుగా ఉన్న రాజ్ కుమార్, మనోజ్ కుమార్ , రాజేష్ ఖన్నా వంటి వారితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించేది. సినిమాల్లో లక్షల కోట్లు సంపాదించిన హీరోయిన్ తన ఇంటి పనులు తానే చేసుకునేది. డబ్బు వృధా చేసుకోకూడదు అని పని వాళ్ళని కూడా పెట్టుకోలేదు. అయితే 1978లో ఒకరోజు ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు కూడా చేశారు ఆ దాడులు ఆమె బాత్రూం గడ్డలు 12 లక్షల పైగా ధనం స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఒక అణ, రెండు అణాలు, పెన్నీలలో వేతనాలు చెల్లిస్తే ఇంత డబ్బును భారీ మొత్తంగా భావించేవారు. అయితే ఆ డబ్బును తన తండ్రి దాచిపెట్టాడని .. తనకు తెలియదని మాలా చెప్పినట్లు సమాచారం.
అలాగే ఆమె అధికారులతో పలుమార్లు మాట్లాడినా పరిష్కారం దొరకలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా.. ఆమె లాయర్, ఆమె తండ్రి డబ్బును తిరిగి పొందమని సలహా ఇచ్చారు. దీంతో ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం వ్యభిచారం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినట్లు చెప్పిందట. అయితే కోర్టులో మాలా చిన్న చెప్పిన మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. స్టార్ హీరోయిన్ అయి ఉండి వ్యభిచారం ద్వారా డబ్బులు సంపాదించిందని తెలియటంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మానేశారు ఒక్కసారిగా ఆమె కెరీర్ దెబ్బతింది. సంవత్సరానికి ఐదు నుంచి ఆరు సినిమాలు చేసే ఆమె తర్వాత ఒకటి రెండు సినిమాలో నటించింది. మాలా సిన్హా నేపాలీ నటుడు చిదంబర్ ప్రసాద్ లోహానిని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయింది