బరితెగించిన సురేఖ వాణి కూతురు... అతనితో బెంగుళూరులో?

Veldandi Saikiran
నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. సురేఖ వాణి, సురేష్ తేజకి సుప్రీత అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను అన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. సుప్రీత సినిమాలలో పెద్దగా నటించకపోయినప్పటికీ విపరీతంగా ఫేమస్ అయ్యింది.

సోషల్ మీడియాలో సుప్రీత పెట్టే ఫోటోలకు, వీడియోలకు నెటిజెన్స్ ఫిదా అవుతూ ఉంటారు. సినీ నేపథ్యం ఉన్న సురేష్ తేజ, సురేఖ వాణి జంటకు పుట్టిన సుప్రీత అతి చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన టాలెంట్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా సుప్రీత యూట్యూబర్ గా ఫేమస్ అయింది. సుప్రీత హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.

నటన మీద ఉన్న ఇష్టంతో 2019లో "మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్" అనే షార్ట్ ఫిలింతో యాక్టింగ్ వైపుకు వచ్చింది. ఇందులో నటించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అనంతరం "అవర్స్ వర్సెస్ అదర్స్", "వెళ్లిపో", "గాయత్రి పోతే పోవే" అనే పాటలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ఓ సినిమాలో కూడా నటిస్తోంది.

ఇదిలా ఉండగా.... సుప్రీత ఓ వ్యక్తితో కలిసి బెంగుళూరులోని పబ్బులలో తిరుగుతోందట. ఆ అబ్బాయి ఎవరూ, ఏంటి అనే విషయాలు చెప్పకపోయినప్పటికీ తన బాయ్ ఫ్రెండ్ అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఆ వ్యక్తితో కలిసి పబ్బులకు, పార్టీలకు తిరుగుతుండడంతో అందరి దృష్టి సుప్రీత వైపు పడింది. ఇక ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.  కాగా... నటి సురేఖ వాణి అటు సినిమాల్లో రాణిస్తున్నారు. తల్లి పాత్రలు, చెల్లి, అక్క, కోడలు, అత్త ఇలా ఎలాంటి పాత్రలు వచ్చినా వదలడం లేదు నటి సురేఖ వాణి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: