మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు.. భారీగా కలెక్షన్స్ సాధించి దూసుకుపోతున్నాడు.. అయితే ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ సినిమాకి ముందు ఆ తరువాత అని చెప్పాలి టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ వరుస ప్లాప్స్, డిజాస్టర్స్ అందుకున్నాడు.. అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాలలో కథ బాగున్నా గాని కథనంలో తేడా కొట్టినవి చాలానే వున్నాయి. వాటిలో ఊసరవెల్లి మూవీ ఒకటి..2011 అక్టోబర్ 6న రిలీజైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది..అయితే థియేటర్స్ లో ఈ సినిమా ఎందుకు తేడా కొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం....భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలివారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా కానీ ఆ తర్వాత యావరేజ్ సినిమాగా నిలిచింది. శక్తి మూవీ వంటి భారీ ఫ్లాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబోలో తెరకెక్కిన ఊసరవెల్లి మూవీ కోసం తారక్ ఫాన్స్ కసితో ఎదురుచూసారు... కానీ సినిమా చూసాక వాళ్ళ అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. కిక్ మూవీ తర్వాత సురేంద్రరెడ్డి తీస్తున్న మూవీ కావడంతో తారక్ ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు.. ఎన్టీఆర్ స్టైలిష్ నెస్, ఆకట్టుకునే సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూశాక సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.కానీ థియేటర్ లో బొమ్మ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు..
ఈ సినిమా మొత్తంగా రూ.27.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి యావరేజ్ మూవీగా నిలిచింది... రూ.25 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో రూ.35 కోట్లకు అమ్ముడైంది. అందులో 80 శాతం మాత్రమే రాబట్టింది. ఎన్టీఆర్ నటన, తమన్నా గ్లామర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇన్ని ప్లస్ పాయింట్స్ వున్నా కానీ సినిమాలో కొన్ని తప్పులు కారణంగా సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేదు.. ఈ సినిమాకు టైటిల్ ఊసరవెల్లి అని పెట్టడం, మొదటి భాగంలో ఎన్టీఆర్ నటన హైలెట్ గా ఉన్నా, సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి సంబంధం లేకుండా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ నడవడం, ఎన్టీఆర్ కనిపించకుండా ఆ ఎపిసోడ్ నడవడం సినిమాకి బాగా మైనస్ అయింది. హీరోయిన్ ఆశయమే కోసం తన లక్ష్యంగా చేసుకునే హీరో గా కథ బాగానే వున్నా కథనంలో దర్శకుడు తడబడ్డాడు.. కథలో కూడా ప్రేక్షకులు కొద్ది మార్పులు కోరుకున్నారు..అది గాక ఈ సినిమా మహేష్ దూకుడు సినిమాకు రెండు వారాల ముందు విడుదల కావడంతో దూకుడు సునామిలో ఈ సినిమా కొట్టుకుపోయింది..దీనితో ఎన్టీఆర్ కెరీర్ లో మరో ప్లాప్ వచ్చినట్లు అయింది..