చిన్నారి నటనకు ఫిదా అయిన జక్కన్న..ప్రస్తుత హీరోయిన్లకు షాకిచ్చేలా ఉందిగా.?

FARMANULLA SHAIK
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీని పాన్ ఇండియా రేంజ్కి తీసుకువెళ్లిన ఏకైక దర్శకుడు రాజమౌళి.రాజమోళికి నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ ఎంత బాగా రాబట్టుకోవాలో తెలుసు. రాజమౌళి సినిమా అంటే దాదాపుగా అందరు నటులు అద్భుతంగా నటిస్తారు. రాజమౌళి తాను అనుకున్న ఎక్స్ ప్రెషన్ వచ్చేవరకు వదిలిపెట్టరు. ఇదిలావుండగా రాజమోళి తనకి నచ్చిన నటీనటుల గురించి తరచుగా కామెంట్స్ చేస్తుంటారు. ఎంతో నేచురల్ గా నటించే నటీనటులంటే రాజమౌళికి ఇష్టం అట. అలా సహజంగా నటించే నటీమణుల్లో రాజమౌళికి ఇష్టమైన వారు మహానటి సావిత్రి, దిగ్గజ నటి సూర్యకాంతం. వీరి తర్వాత రాజమౌళిని అంతలా మెప్పించిన నటి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ నటి ఎవరో కనీసం కలలో కూడా ఊహించలేం. సావిత్రి, సూర్యకాంతం తర్వాత రాజమౌళిని మెప్పించిన నటి రాజన్న చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ అనీ అట. ఆ చిన్నారి నటనకి తాను ఫిదా అయినట్లు రాజమౌళి తెలిపారు. ఎంతో నేచురల్ గా నటించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతం అని జక్కన్న ప్రశంసించారు. 2011లో రాజన్న చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. రాజన్న చిత్రం రిలీజ్ అయ్యే సమయానికి అనీ వయసు 10 ఏళ్ళు. అసలు అంత చిన్న వయసులో కథని ఎలా అర్థం చేసుకుందో నాకు అర్థం కావడం లేదు. ఆమె నటిస్తుంటే నాకు షాకింగ్ గా అనిపించి అనీ నీ వయసు 10 ఏళ్లేనా అని మరోసారి అడిగినట్లు నాగార్జున ఫన్నీ కామెంట్స్ చేశారు. రాజన్న చిత్రం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. కమర్షియల్ గా ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఓ సన్నివేశం చాలా లెన్త్ ఉంటుంది. అంత లెన్తీ సీన్ లో కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్లా కాదు. కానీ అమ్మాయి కళ్ళతోనే ఎమోషనల్స్ పలికించింది అని రాజమౌళి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: