ఒకే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియలో యమ ఫేమస్.. ఈ స్టార్ హీరో భార్య ఎవరో గుర్తుపట్టారా..?
స్టార్ బ్యూటీ రహస్య గోరఖ్ ... టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భార్య .. ఈ సంవత్సరం ఆగస్టు 22 న వీరి పెళ్లి జరిగింది. కర్ణాటకలో ఎంతో గ్రాండ్గా వీరీ వివాహం జరిగింది . ఇక పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం రీసెంట్ గానే క సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిన విషయం తెలిసిందే . గత కొన్నాళ్లుగా వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న కిరణ్ .. క సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రివ్యూస్ కూడా తెచ్చుకోంది . ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది .
అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్ తో ఎంతో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది రహస్య గోరఖ్.. నా భర్త కోసం ఈ సినిమా చూడండి అంటూ ఎంతో క్యూట్గా అందరినీ రిక్వెస్ట్ చేసింది. ఇక దానికి సంబంధించిన వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రహస్య , కిరణ్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. కానీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోహీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కిరణ్, రహస్య జోడిగా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది.