నాకు మగాళ్లు వద్దు...అమ్మాయిలే కావాలి.. సమంత బోల్డ్‌ కామెంట్స్‌ !

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందులో కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వారు ఉంటారు. మరి కొందరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి వారి సత్తాను చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి సమంత ఒకరు. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలోనే మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తోంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి స్టార్ హీరోలు అందరి సరసన జతకట్టి ఆడిపాడింది.

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా సమంత "సిటాడెల్: హనీ బన్నీ" వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ తాజాగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సమంత చాలా హాట్ సీన్లలో నటించింది. వరుణ్ ధావన్, సమంత మధ్య లిప్ కిస్ సీన్ హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాకుండా సమంత ఇందులో చాలా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. దీంతో ప్రతి ఒక్కరూ సమంత ఏంటి ఇలా నటించిందని షాక్ అవుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో రోల్ మోడల్ తప్పకుండా ఉంటారు. ఈ క్రమంలోనే సమంత కూడా తన రోల్ మోడల్ నటి ప్రియాంక చోప్రా అని వెల్లడించింది. బిజినెస్ టుడే నిర్వహించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ కార్యక్రమంలో సమంత మాట్లాడారు. అందులో భాగంగా తనకు రోల్ మోడల్ నటి ప్రియాంక చోప్రా అని సమంత చెప్పారు. సిటాడెల్ మొదటి సీజన్ అమెరికాలో, రెండోవది ఇటలీ, మూడవది భారతదేశం, నాలుగవది మెక్సికోలో జరుగుతూ ఉంటుందని సమంత అన్నారు.

అమెరికా వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటించగా, ఇండియాలో నటించడానికి నాకు అవకాశం దక్కిందని సమంత అన్నారు. ప్రియాంక ఓ గొప్ప నటి, రోల్ మోడల్, గొప్పగా ఆలోచించడం అనేది ప్రియాంక నుంచి నేను నేర్చుకుంటున్నానని సమంత వెల్లడించింది. నాకు మగవారిలో రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరు. అమ్మాయిలే రోల్ మోడల్ అని సమంత పేర్కొంది. నాకు మగవారు వద్దు, అమ్మాయిలే కావాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: