బాల‌య్య - విజ‌య‌శాంతి మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆ సినిమా ఇదే..!

RAMAKRISHNA S.S.
నట‌సింహ నందమూరి బాలకృష్ణ లేడీస్ సూపర్ స్టార్ లేడీ అమితాబచ్చన్ - విజయశాంతి కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ లో ఒకప్పుడు విపరీతమైన క్రేజీ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు తెలుగు సినీ ప్రేక్షకులు అప్పట్లో కచ్చితంగా సినిమా చూడాలి అన్న ఆతృతతో ఉండేవారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు .. ఎంతోమంది స్టార్ దర్శకుల కాంబినేషన్లో బాలయ్య - విజయశాంతి సినిమాలు తెరకెక్కాయి. బాలయ్య - విజయశాంతి కాంబినేషన్ అంటే ఒక తిరుగులేని క్రేజ్ తెలుగు నాట ఉండేది. విజయశాంతి కూడా బాలయ్యతో సినిమా అనగానే తెరమీద ఆ కెమిస్ట్రీ వేరుగా చూపించేది.. అన్న టాక్‌ కూడా ఉండేది. ఎంతో అన్యోన్యంగా ఎంతో స్నేహంగా ఉన్న విజయశాంతి - బాలయ్య మధ్య ఒక సినిమా విషయంలో గ్యాప్ వచ్చింది.

అక్కడి నుంచి వారిద్దరూ తిరిగి కలిసిన నటించలేదు ఆ సినిమా ఏదో కాదు నిప్పురవ్వ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య - విజయశాంతి జంటగా నిప్పుర‌వ్వ లాంటి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు విజయశాంతి నిర్మాత.. పైకి బాలయ్య పేరు వేసుకున్నా తెర వెనక సినిమా ఖర్చు మొత్తం విజయశాంతి భరించారు. సినిమా షూటింగ్ టైంలో బొగ్గు గనుల నేపథ్యంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరిద్దరూ మృతి చెందారన్న వార్తలు బయటికి వచ్చాయి. సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి తోడు భారీ బడ్జెట్ కావడంతో అనుకున్న దాని కంటే చాలా ఎక్కువగా ఖర్చయింది. రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే రోజు బాలయ్య నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు కూడా రిలీజ్ అయింది.

అలా బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. బంగారు బుల్లోడు సూపర్ డూపర్ హిట్ అయితే ... నిప్పురవ్వ భారీ బడ్జెట్ కారణంగా దీనికి తోడు కథ‌ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక ప్లాప్‌ సినిమాగా నిలిచింది. దీనికి తోడు విజయశాంతికి నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలోని విజయశాంతి బంగారు బుల్లోడు సినిమాను బాలయ్య వాయిదా వేయిస్తే నిప్పురవ్వ సినిమాకు మరిన్ని ఎక్కువ వసూళ్లు వచ్చేవని బాలయ్య నిప్పరవ్వ‌ సినిమాపై సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేదన్న భావనకు విజయశాంతి వచ్చేసారు. అలా ఆ సినిమా బాలయ్య విజయశాంతి స్నేహ బంధానికి బేటలు వచ్చేలా చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: