"పెళ్లి ఒకరితో.. శోభనం మరొకరితో"..తమన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
అయితే పుష్ప వన్ మూవీకి దేవి ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ కాస్త మైనస్ అయింది అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు. పాటలు బాగానే ఉన్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం అస్సలు సరిపోలేదు అంటూ టాక్ వచ్చింది. దీంతో అప్పుడే బన్నీ పుష్ప2కి దేవి వద్దు అంటూ చెప్పారట . కానీ సుకుమార్ ఆయనపై ఉండే ఇష్టంతో ఛాన్స్ ఇద్దామంటూ ఇంతవరకు నెట్టుకొచ్చారట . ఫైనల్లీ దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ విని బన్నీ బాగా ఫైర్ అయిపోయారట . దీంతో సుకుమార్ బన్నిని కన్విన్స్ చేయడానికి తమన్ ని ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే కరెక్ట్ గా ఇదే మూమెంట్లో గతంలో తమన్ మాట్లాడిన మాటలతో వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.
"కొంతమంది మూవీ వర్కర్స్ సినిమాను పార్ట్ లుగా పార్ట్లు గా విడగొట్టేస్తున్నారు . మరి ముఖ్యంగా ఒక పాట ఒకరితో మ్యూజిక్ చేస్తే మరొక పాట ఇంకొకరితో మ్యూజిక్ చేస్తున్నారు . ఒకే సినిమాలో ఒక సాంగ్ ఒకరితో వర్క్ చేయిస్తే ఆర్ఆర్ మాత్రం మరొకరి తో వేయిస్తున్నారు . అది అస్సలు నాకు నచ్చడం లేదు అలా సినిమాని ముక్కలు ముక్కలు గా విడదీసి చేయిస్తూ ఉంటే నాకు నచ్చడం లేదు" పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో చేయించినట్లుగా ఉంటుంది" అంటూ సెటైరికల్ గా కామెంట్ వేశారు . తమన్ ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేసాడో తెలియదు కానీ పుష్ప2 సినిమాకి ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ తమన్ చేయబోతున్నాడని తెలిసిన తరువాత..మరొకసారి ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా తమన్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ప్రస్తుతం తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..!