అభిషేక్ బచ్చన్ ఇంట్లో గొడవ.. మాజీ ప్రేయసితో రెండో పెళ్లి.?

Pandrala Sravanthi
బాలీవుడ్ లో ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు.కానీ అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ గురించి రోజుకొక వార్త మీడియాలో వినిపిస్తోంది. అయితే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారని ఎన్ని వార్తలు వినిపించినా కూడా ఎప్పటికప్పుడు ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ఇద్దరూ ఆ  వార్తలను తిప్పికొడుతూ వాళ్ళిద్దరూ కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.అయితే  వీళ్ళిద్దరూ గ్రే డివోర్స్ తీసుకుంటారని కూడా వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో బీటౌన్ లో ఎక్కడ చూసినా సరే ఐశ్వర్య అభిషేక్ వార్తలే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇలాంటి వేళ తాజాగా మరో వార్త మీడియా లో సంచలనం సృష్టిస్తుంది. అదేంటంటే.. ఐశ్వర్యరాయ్ తో అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీకి గొడవలు బాగా ముదిరాయని ఇంట్లో పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకోవడం అభిషేక్ తల్లికి సోదరికి నచ్చలేదు. 

దీంతో పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాతే అసలు గొడవలు బయటపడ్డాయట. ఇక ఈ గొడవల కారణంతో ఐశ్వర్య ఇంటి నుండి బయటకు వచ్చే వేరు కాపురం పెడదామన్నా కూడా అభిషేక్ ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ముదురుతున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే చాలా రోజుల నుండి విడాకుల వార్త వినిపిస్తున్నాయి. ఇక అభిషేక్ బచ్చన్ సోదరి తల్లి జయ బచ్చన్ ఇద్దరూ ఐశ్వర్యారాయ్ కి విడాకులు ఇచ్చి మాజీ ప్రేయసి కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకోమని చెప్పినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అభిషేక్ పెళ్లి మొదట కరిష్మా కపూర్ తోనే జరిగేది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు పెళ్లి చేసుకోలేదు.

ఆ తర్వాత కరిష్మా వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్నప్పటికీ గొడవలు భరించలేక విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటుంది.ఈ నేపథ్యంలోనే అభిషేక్ తల్లి సోదరి ఇద్దరు ఐశ్వర్య కు విడాకులు ఇచ్చి మాజీ ప్రేయసి కరిష్మా కపూర్ ని రెండవ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక తాజాగా సోషల్ మీడియాలో కరిష్మా కపూర్ కి రెండో పెళ్లి చేసుకుంటారా అని ఓ నెటిజన్ అడగగా డిపెండ్ అంటూ ఆన్సర్ ఇచ్చింది.. దీంతో అభిషేక్ కరిష్మా కపూర్ ల రెండో పెళ్లి వార్తలు బీ టౌన్ లో సంచలనం సృష్టిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: