తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారింది.
ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఈమె తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఈమెకు క్రేజీ సినిమా అవకాశాలు రావడం , అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడం జరుగుతూనే వస్తుంది. ఈ మధ్య కాలంలో మాత్రం సమంత పరస పెట్టి సినిమాలు చేయడం లేదు. ఈ మధ్య కాలంలో ఈమె ఖుషి , శాకుంతలం అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దగ్గర బోల్తా కొట్టాయి. సమంత రీసెంట్ టైం లో ఎక్కువగా సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్లలో నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఓ పెద్ద అవార్డ్స్ వేడుక జరిగింది. ఇందులో భాగంగా రానా , సమంత మధ్య ఓ సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో సమంత , రానా ను నువ్వు ఎందుకు సినిమాలు చేయట్లేదు అని అడిగింది. దానితో నన్ను ఎవరు తీసుకోవడం లేదు అని అన్నాడు. ఇక సమంత కూడా సైలెంట్ గా నన్ను ఎవరు తీసుకోవడం లేదు అనేసింది. దానితో అంతా ఒక సారిగా నవ్వారు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరల్ గా మారింది.