ఆర్య: "అ అంటే అమలాపురం" అంటూ కుర్ర కారను ఊపేసిన పాట..!!

Pandrala Sravanthi

- ఐటెం సాంగ్ తో ఆర్య సినిమాకి మరింత పేరు...
- ఐటెం సాంగ్ తో అభినయకి మంచి గుర్తింపు..

 సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా అను మెహతా హీరోయిన్ గా వచ్చిన ఆర్య సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.  అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎంత ఫేమస్ అయ్యింది..దీని గురించి ఇతర వివరాలు తెలుసుకుందాం..
 అ అంటే అమలాపురం :

 అల్లు అర్జున్ అనూ మెహతా కాంబినేషన్లో శివ బాలాజీ కీలకపాత్రలో నటించిన ఆర్య సినిమా అప్పట్లో యూత్ ని తెగ అట్రాక్ట్ చేసింది. అంతే కాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ వన్ సైడ్ లవ్ అంటూ శివ బాలాజీ ప్రేమించిన హీరోయిన్ అనూ మెహతాని వన్ సైడ్ లవ్ చేయడం వారిద్దరి మధ్య పుల్ల పెడుతూనే మళ్లీ వారిని కలపడానికి ట్రై చేయడం.. ఇలా ఎన్నో సన్నివేశాలు ఈ సినిమా చూసిన వారిని ఆకట్టుకుంటాయి. ఇక చివర్లో రౌడీల బారి నుండి అనూ మెహతాని అల్లు అర్జున్ కాపాడడంతో అనూ మెహతాకి అల్లు అర్జున్ మీద ప్రేమ పుడుతుంది  అలా చివరికి శివ బాలాజీ తో పెళ్లి పీటల వరకు వెళ్లి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చేలా నాకు ఆర్య కావాలి అంటూ ఆర్య దగ్గరికి వచ్చేస్తుంది.

అలా అల్లు అర్జున్ కి అనూ మెహతా సినిమాకి సంబంధించిన శుభం కార్డు పడుతుంది. అయితే ఈ సినిమాలో అన్ని పాటలతో పాటు ఐటం సాంగ్ అయినా అ అంటే అమలాపురం సాంగ్ కూడా ఎంతో పెద్ద హిట్ అయింది.ఈ పాటలో అభినయ అల్లు అర్జున్ సరసన చాలా ఎనర్జిటిక్ గా ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేసింది."అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం అంటూ ఈ పాట అభినయ చాలా ఎనర్జిటిక్ గా చేసింది.ఇక ఈ పాట అప్పట్లో ఎంతో మంది యూత్ ని ఆకట్టుకుంది.ఎవరి నోట చూసినా కూడా అ అంటే అమలాపురం అంటూ వినిపించేది. అలా అప్పట్లో ఎంతో హిట్టు కొట్టిన ఈ పాటకి ఇప్పటికి కూడా ఎంతో క్రేజీ ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: