హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024: ఓడి గెలిచిన టీడీపీ నేత బండారు శ్రావణి..!
* ఆమె సంకల్ప బలమే అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసింది..
•అవమానాలు ఎదురైనా.. గెలిచి చూపించింది బండారు శ్రావణి..
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉండేది.. ఇక్కడ ఎవరు గెలిచిన వారిదే అధికారం అన్నట్లుగా ఒక సెంటిమెంట్ కూడా ఉంది.. అయితే ఈసారి అన్ని సెంటిమెంట్లు కూడా కూటమి ప్రభుత్వం చెరిపేసింది. ఇక్కడ టిడిపి అభ్యర్థి అయిన బండారు శ్రావణి విజయ కేతనం ఎగరేసింది. అయితే బండారు శ్రావణి విజయం వెనుక ఎంతో కష్టం ఉందని కూడా చెప్పవచ్చు.. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది కూడా.. తన వంతు ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసింది.. ఇదిలో ఉండగా ఈసారి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఈమెకు పూర్తిగా వైసిపి అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు నిలబడ్డారు.
అయినా కూడా లెక్కచేయకుండా మండుటెండలో రాజకీయ ఎన్నికల ప్రచారం చేస్తూ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పనిచేసేలా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్ళింది. అలా విస్తృతంగా ప్రచారం చేస్తున్న సమయంలో మండుటెండలకు స్పృహ తప్పిన బండారు శ్రావణి అనారోగ్యానికి కూడా గురైన సందర్భాలు ఉన్నాయి. దీంతో కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకున్న విశ్రాంతి సమయంలో కూడా ప్రజల గురించి ఆలోచించింది.. తద్వారా తన సోదరిని రంగంలోకి దింపి ప్రచారం చేయించింది. ఆ తర్వాత ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తిరిగి మరీ ప్రచారానికి సిద్ధమై.. తన సంకల్ప బలంతో 2024 ఎన్నికలలో 8,788 ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థిని ఓడించడం జరిగింది. 2019లో సింగనమల నుంచి పోటీ చేసిన ఈమె వైసిపి ప్రత్యర్థి అయిన జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా 2024లో పోటీ చేసి సత్తా చూపిస్తూ విజయాన్ని అందుకుంది.
బండారు శ్రావణి కి టిడిపి పార్టీ నుంచి సీటు ఇవ్వడాన్ని.. సొంత పార్టీలోనే వ్యతిరేకించినప్పటికీ.. చంద్రబాబు సీట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ మహిళా నేతకే సీటు కేటాయించడం జరిగింది. అయితే బండారు శ్రావణి గెలవడానికి చాలానే కృషి చేసింది. ముఖ్యంగా కూటమిలో భాగంగా టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఏకమవడంతో చాలామంది నేతలు గెలవడానికి ఉపయోగపడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గెలిచిన తర్వాత కూడా బండారు శ్రావణి తన నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేయడమే కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలను సందర్శిస్తూ వుంటుంది.