స్టార్ హీరోయిన్లకు వరుస షాకులిస్తున్న మీనాక్షి.. ఈ రేంజ్ లో ఆఫర్లు సాధ్యం కాదుగా!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మీనాక్షి చౌదరి హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు. నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒకరాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపికయ్యారు. అనగనగా ఒకరాజు సినిమాతో మీనాక్షి చౌదరి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడం పక్కా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కాని స్థాయిలో మీనాక్షి చౌదరి ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ తో సైతం నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మీనాక్షి చౌదరి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం ద్వారా కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మీనాక్షి చౌదరికి ఆఫర్లు వస్తుండటం గమనార్హం.
 
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాలలో ఎక్కువగా మీనాక్షికే ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు వరుస విజయాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి తర్వాత సినిమాలతో సైతం మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నవీన్ పోలిశెట్టికి భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. ఈ హీరో సక్సెస్ రేట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.
 
మీనాక్షి చౌదరి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. మీనాక్షి చౌదరి భిన్నమైన ప్రాజెక్ట్ లకు ఓటు వేస్తే ఆమె సక్సెస్ రేట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మీనాక్షి చౌదరి సినిమాల ఎంపికను చూసి ఇతర హీరోయిన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. మీనాక్షి చౌదరి రెమ్యునరేషన్ ప్రస్తుతం కోటిన్నర నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. మీనాక్షి చౌదరి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: