సాయి పల్లవి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. ఇది ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ తెలుసుకోండి రా అబ్బాయిలు..!

Thota Jaya Madhuri
ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాము. అసలే సాయి పల్లవి అంటే కుర్రాళ్ళు పడి చచ్చిపోతూ ఉంటారు.  అందానికి అందం ..నటనకి నటన ..మంచితనానికి మంచితనం.  అంతేనా మిగతా హీరోయిన్స్ లో లేని ఆ లక్షణం కూడా హీరోయిన్ సాయి పల్లకి ఉంది అంటూ తెగ పొగడేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మిగతా హీరోయిన్స్ డబ్బు కోసం ఎలాంటి రోల్స్ అయినా చేస్తారు? లిప్ లాక్ సీన్స్ లో కూడా నటిస్తారు.


కానీ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం డబ్బును అస్సలు లెక్క చేయదు.  కథ నచ్చితే ఆ కథ కోసం డబ్బులు లేకుండా కూడా నటిస్తుంది.  మరి ముఖ్యంగా తను కధను నమ్మి ఆ సినిమాలో నటిస్తే ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం కూడా వెనక్కి ఇచ్చేస్తుందట . ఇదే విషయం ఒక సినిమాలో ప్రూవ్ అయింది . "పడి పడి లేచే మనసు" సినిమాలో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి. ఈ సినిమాలో హీరోగా నటించాడు శర్వానంద్.


ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అప్పట్లో జనాలు.  కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమరైపోయింది.  సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అయినా సాయి పల్లవి ఏమాత్రం బాధపడలేదు భయపడలేదు . ఆమె ఈ సినిమాకి నష్టాలు వచ్చాయి అని తెలుసుకొని తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసిందట . తన తల్లి చెప్పిన కారణంగానే ఇలా సాయి పల్లవి చేసిందట . అయితే డైరెక్టర్ సాయి పల్లవి మంచి మనసుకి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారట . ఈరోజుల్లో మీలాంటి హీరోయిన్ ఉండటం గ్రేట్. డబ్బు ఇస్తేనే షూటింగ్ కి వస్తామంటూ తెగేసి చెప్పే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో మీలాంటి మంచి మనసు ఉన్న హీరోయిన్ కూడా మా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గర్వకారణం అంటూ ఆ సినిమాకి సగం రెమ్యూనరేషన్ ని ఆమెకి మళ్ళీ తిరిగి ఇచ్చేసారట . సాయి పల్లవి మంచితనానికి ఇదే నిదర్శనం అంటున్నారు ఆమె అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: