శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా అమరన్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు , మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని భారీ లాభాలను అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ , వచ్చిన లాభాల గురించి తెలుసుకుందాం.
6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.49 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.69 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 4.57 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.75 కోట్ల షేర్ ... 19.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినట్లు సమాచారం. 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 6.75 కోట్ల లాభాలను అందుకుంది. ఇకపోతే స్ట్రేట్ తెలుగు సినిమాలు అయినటువంటి క , లక్కీ భాస్కర్ సినిమాలు కూడా అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయ్యాయి. ఈ మూవీలు కూడా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న అమరన్ స్థాయి లాభాలను మాత్రం అందుకోలేదు.