శోభన్ బాబు మరదలకు సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న లింక్ ఏంటి.. అసలు వీరి మధ్య ఏం జరిగిందంటే..?

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒకప్పుడు స్టార్ హీరోలుగా తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ - శోభన్ బాబు .. అయితే శోభన్ బాబు ఎప్పుడు హీరో గానే ఉండాలని ఆయన నట జీవితంలో ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించలేదు . ఆయన చివరి వరకు హీరో అనే పేరుతోనే చివరి శ్వాస వరకు ఉన్నారు . అయితే శోభన్ బాబు - సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఇండస్ట్రీలో గొప్ప స్నేహితులు ఒకరి కష్టసుఖాలు మరో కొరికి చెప్పుకునే అంతగా వీరి మధ్య బంధం ఉండేది . శోభన్ బాబు ఎక్కువగా కృష్ణ ఇంట్లోనే ఉండేవారు .

అలాగే కృష్ణ అమ్మ నాన్నలు కూడా శోభన్ బాబును వారి పెద్దబ్బాయిలా చూసేవారట . అలాగే కృష్ణ తొలి రోజుల్లో ఎక్కువగా శోభనబాబు ఇంట్లో ఉండేవారు .. ఇద్దరూ తమ కష్టసుఖాలు ఒకరినొకరు చెప్పుకొని జీవితంలో ముందుకు సాగే వారట . అయితే ఆ రోజుల్లో శోభన్ బాబు మరదలు ఆయన ఇంట్లోనే ఉండేదట .. అప్పుడప్పుడు కృష్ణ ఆమెతో మాట్లాడుతూ ఉండేవారట .. అయితే శోభన్ బాబు కి ఆయన మరదల్ని కృష్ణకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునే వారట .

ఇదే విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ అమ్మ నాన్నలకు కూడా చెప్పారట . ఆ సమయంలో కృష్ణ అమ్మ గారు నా ఇంటికి వచ్చే కోడలు నా కొడుకు లాగా తెల్లగా ఉండాలి అని ఆయనతో చెప్పిందట. ఇలా నిజ జీవితంలో బంధువులుగా మారాల్సిన కృష్ణ - శోభన్ బాబుల ఆ సంబంధాన్ని ఆపింది కృష్ణ తల్లి అంటూ అప్పట్లో పలు వార్తలు కూడా వచ్చాయి . అయితే శోభన్ బాబు మరదల్ని కృష్ణ పెళ్లి చేసుకోకపోయినా కానీ వారిద్దరి మధ్య స్నేహం మాత్రం అస్సలు చెడిపోలేదట . మరణించే వరకు ఇద్దరు కలిసి ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: