ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరో చేసుకోని విధంగా పెళ్లి చేసుకోబోతున్న నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల..!

Thota Jaya Madhuri
త్వరలోనే నాగచైతన్య - శోభిత  ధూళిపాళ్ల మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు . కాగా వీళ్ళ పెళ్లికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి . రీసెంట్గా జరిగిన ఏఎన్ఆర్ అవార్డ్స్ 2024 లో ఈ జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . అప్పుడే అక్కినేని నాగార్జున ..శోభిత ధూళిపాళ్లకు అక్కినేని ఇంటి కోడలి హోదాను కూడా కట్టపెట్టేసారు . కాగా వీళ్ల పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వడమే కాకుండా అక్కినేని అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ట్రెడిషన్ బాగా ఫాలో అయ్యే శోభిత.. తన పెళ్లిల్ని హిందూ సంప్రదాయ పద్ధతిని ఫాలో అవుతూ ఆమె పెళ్లిలో తప్పకుండా కొన్ని ఆచారాలను ఫాలో అవ్వాలి అంటూ డిసైడ్ అయిందట .


నేటి తరం ఆడవాళ్లకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ తన పెళ్లిని హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం జరుపుకోవాలి అంటూ డిసైడ్ అయిందట.  అంతేకాదు ఆమె పెళ్లి తన సొంత ఊరిలోనే జరుపుకోవాలని మొదటి నుంచి అనుకునిందట కానీ అక్కినేని కుటుంబ సభ్యుల డెసిషన్ ప్రకారం ఆమె తన పెళ్లిని హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసుకోవడానికి ఫైనల్ గా ఒప్పుకుందట . ఇప్పటికే ఈ స్టూడియోలో పెళ్లి మండపాన్ని రెడీ చేయడానికి  మొత్తం సిద్ధం చేశారట.  ఆకర్షణీయంగా  డెకరేషంతో స్టేజ్ మొత్తం నింపేస్తున్నారట.


ఇప్పటివరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆ రికార్డును సొంతం చేసుకుంటున్నాడు  నాగచైతన్య . అది కూడా రెండో పెళ్లితో . అక్కినేని నాగేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత ఆయన పార్తిపదేహాన్ని ఇదే స్టూడియోలో ఖననం చేశారు . కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకుంటేనే ఏఎన్ఆర్ ఆశీర్వాదాలు ఉంటాయి అని భావించి నాగచైతన్య ఈ డెసిషన్ తీసుకున్నారట . అంతేకాదు ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా ఇలా చేసింది లేదు . దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల పెళ్లి వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు నాగార్జున సైతం నాగచైతన్య డెసిషన్ పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట . తండ్రి ఆశీర్వాదాలు మరోక  పక్క తాత బ్లెస్సింగ్స్ ఉండగా నాగచైతన్య -  ఇంకేం కావాలి అంటున్నారు అక్కినేని అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: