ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జగపతిబాబు నటించిన సినిమా అదే.. ఎందుకో తెలుసా..?

frame ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జగపతిబాబు నటించిన సినిమా అదే.. ఎందుకో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జగపతి బాబు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో వరుస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తూ వచ్చాడు. జగపతి బాబు హీరోగా నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించడంతో ఈయనకు హీరో గా మంచి గుర్తింపు లభించింది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం ఈయన హీరో గా నటించిన సినిమాలు వరస పెట్టి ఫ్లాప్ అవుతూ రావడంతో హీరోగా ఈయనకు సినిమా అవకాశాలు తగ్గాయి. అలాంటి సమయం లోనే జగపతి బాబు ... బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన లెజెండ్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ తో ఈయనకు సూపర్ క్రేజ్ వచ్చింది.


దానితో ప్రస్తుతం జగపతి బాబు సినిమాల్లో విలన్ , కీలక పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే జగపతి బాబు ఒక సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా మూవీ చేశాడట. ఆ మూవీ ఏది అనే వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. తాజాగా ఈయన జగపతి బాబు గురించి చెబుతూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం తమిళ్ లో ప్రకాష్ రాజ్ హీరోగా నటించిన ఓ సినిమా హక్కులను విడుదలకు ముందే తీసుకున్నాను. ఆ సినిమాను ఆకాశమంత పేరుతో తెలుగు లో విడుదల చేశాను. ఇక ఆ మూవీ లో ఓ కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తే బాగుంటుంది అనిపించింది.


దానితో వెంటనే వెళ్లి ఆయన్ను కలిశాను ... విషయం చెప్పాను. ఆయన సినిమా మొత్తం చూసి చేస్తాను అని అన్నాడు. ఇక ఆ తర్వాత నేను జగపతి బాబు గారితో ఎంత తీసుకుంటారు సార్ అని అన్నాను. దానితో ఆయన ఇలాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడం ముఖ్యం. ఈ మూవీ కోసం నేను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోను అని అన్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: