వాళ్ల టార్చర్‌ తట్టుకోలేక...హైదరాబాద్‌ ఆస్తులు అమ్ముకుంటున్న సమంత ?

Veldandi Saikiran
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. నాగచైతన్య కెరీర్ లో ఎక్కువగా తాను నటించిన సినిమాలలో లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ అవుతుండడం విశేషం.

నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. అప్పటినుంచి ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

కేవలం 4 ఏళ్ళ సమయంలోనే వీరి వివాహ బంధానికి ముగింపు పలికారు. వీరు విడాకులు తీసుకుని ఎవరికి వారుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమాయణం కొనసాగించాడు. ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట కొద్దిరోజుల్లోనే వివాహం చేసుకోబోతున్నారు. సమంత మాత్రం ఇప్పటికే సింగిల్గానే ఉంది. తన జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదని ఎంతో ప్రేమించి నాగచైతన్యను వివాహం చేసుకున్నానని ఓ సందర్భంలో సమంత వెల్లడించింది. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన అనంతరం సమంత బాధలో ఉందట.

ఈ బాధతోనే ఇక హైదరాబాదులో ఉండకూడదని నిర్ణయించుకుందట. ఈ క్రమంలోనే హైదరాబాదులో తనకు సంబంధించిన ఆస్తులను సమంత అమ్ముకుంటున్నట్లు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక త్వరలోనే సమంత ముంబై వెళ్లి అక్కడే ఉండాలని నిర్ణయించుకుందట. ముంబైలో సమంత ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: