పెళ్లయిన స్టార్ హీరో పై మోజు పడ్డ రాశి.. ఆయన పెళ్లి చేసుకోపోతే చస్తానని గొడవ.?

Pandrala Sravanthi
సీనియర్ హీరోయిన్ రాశి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.అయితే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను, సీక్రెట్ విషయాలను కొన్ని ఇంటర్వ్యూలలో బయటపెడుతూ ఉంటారు. ఆ సమయంలో వారికి సంబంధించిన విషయాలు బయటపడడంతో ఈ విషయాలు తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతారు. అయితే అలాంటిదే ఇప్పుడు రాశి గురించి ఒక మ్యాటర్ వైరల్ అవుతుంది. అదేంటంటే రాశి ఓ పెళ్లయిన స్టార్ హీరో పై ప్రేమ పెంచుకొని పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను అనే పరిస్థితికి వచ్చిందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే.. దగ్గుబాటి వెంకటేష్.. అవును మీరు వినేది నిజమే. రాశికి దగ్గుబాటి వెంకటేష్ అంటే చెప్పలేనంత ఇష్టమట. ఇక ఇదే విషయాన్ని రాశి ఆలీతో సరదాగా అనే టాక్ షో లో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో బయటపెట్టింది.

రాశి ఆ టాక్ షోలో మాట్లాడుతూ.. నాకు చిన్నతనంలో వెంకటేష్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది.ఆయనకి పెళ్లయింది ఆయన పెద్ద హీరో అని తెలిసినా కూడా పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను అని ఇంట్లో భీష్మించుకొని కూర్చున్నాను.అయితే ఈ విషయంలో నా తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా కూడా నేను వినలేదు.ఆ తర్వాత వెంకటేష్ ని మర్చిపోయి రాజీవ్ గాంధీ మీదికి నా మనసు మళ్లింది.ఆయన ఓ పెద్ద పొలిటిషన్ అనే సంగతి నాకు తెలియదు. కానీ ఓ పేపర్లో ఆయన ఫోటో చూసి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు..పెళ్ళంటూ చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అయితే ఈ విషయంలో కూడా ఇంట్లో గొడవ గొడవ చేశాను.

 

ఈ విషయంలో నా తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అయ్యారు. అలా నేను చిన్న తనంలో ఎంతో వెరైటీగా మాట్లాడేదాన్ని. అలాగే నేను సినిమాలో హీరోయిన్ గా చేసే సమయంలో కూడా నేను చేసే డైరెక్టర్లతో,నిర్మాతలతో నేను పెళ్లి చేసుకుంటాను ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అని చెప్పే దాన్ని. నా మాటలకు వాళ్ళు కూడా షాక్ అయిపోయేవారు అంటూ రాశి చెప్పుకొచ్చింది. ఇక రాశి ప్రేమించిన హీరో వెంకటేష్ తో రెండు మూడు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయట. కానీ కాంబినేషన్ సెట్ అవ్వకపోవడంతో వీరి జోడి తెరపై కనిపించలేదు. కానీ వెంకీ హీరోగా చేసిన శీను మూవీలో మాత్రం తన అభిమాన హీరో వెంకటేష్ తో ఐటెం సాంగ్ చేసే అవకాశం రాశి కి వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: