బాలయ్య కెరీర్ లోనే ఇండస్ట్రీ విజయాలు ఇచ్చిన ఆ కాంబో ఎందుకు బ్రేక్ అయింది అంటే.. ఎవరు ఊహించరు..!

Amruth kumar
ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ కు తిరుగులేని క్రేజ్ ఉంది . ఇక వీరి కలయికలో సింహా , లెజెండ్ , అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం అఖండకు సిక్వల్ గా అఖండ 2 సినిమా షూటింగ్ కూడా మొదలు కావడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు బోయపాటి లాగానే గతంలో కోడి రామకృష్ణ తో కూడా బాలయ్య కాంబినేషన్ కి తిరుగులేదని పేరు వచ్చింది .

బాలకృష్ణ - కోడి రామకృష్ణ కాంబినేషన్ అనగానే మంగమ్మగారి మనవడు , ముద్దుల కృష్ణయ్య , మువ్వగోపాలుడు  , ముద్దుల మామయ్య వంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. ఇలాంటి హిట్ సినిమాల తర్వాత ఎవరు ఊహించని విధంగా వీరి కాంబినేషన్ ఆగిపోయింది. ఈ సినిమాలు అన్నీ కూడా భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలకృష్ణ నిర్మించారు. ఆ తర్వాత కూడా ఈ ముగ్గురు కలిసి ఒక జానపద సినిమాను మొదలు పెట్టారు అది సగం షూటింగ్ తర్వాత అనుకోకుండా ఆగిపోయింది. అయితే బాలకృష్ణను స్టార్ హీరోగా మార్చిన సినిమాలను డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణతో.. మళ్లీ ఎందుకు సినిమా చేయలేదని ప్రశ్న చాలా మంది లో ఉండిపోయింది .

అయితే దీనికి కొన్ని సంవత్సరాలు కిందట దర్శకుడు కోడి రామకృష్ణ సమాధానమిచ్చారు .. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లో బాలకృష్ణ ఎన్నో గొప్ప సినిమాల్లో మంగమ్మగారి మనవడు తరువాత బాలయ్య స్టార్ హీరోగా మారిపోయాడు. ముద్దుల మావయ్య తరువాత బాలయ్య నెంబర్ వన్ హీరో అయ్యారు. ఆయన పారితోషకం కూడా బాగా పెరిగిపోయింది. బాలయ్యతో సినిమా తీస్తే .. మన కోసం ఆయన పారితోషకం తగ్గించుకోవాలి. అలాంటి పరిస్థితి బాలయ్య కి రాకూడదు . ఆ స్థాయి పారితోషకం ఇచ్చే స్థాయికి మనం చేరుకున్నాకే సినిమా తీద్దాం అన్నారు గోపాల్ రెడ్డి . అందుకే మా కాంబోలో సినిమాలు రాలేదని చెప్పారు కోడి రామకృష్ణ . కొందరూ మధ్య వర్తుల కారణంగానే జానపద సినిమా ఆగిపోయింది అన్నీ కూడా అయ‌న అన్న‌రు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: