ప్రభాస్ ఫోన్ లాక్కుని మరి మెసేజ్స్ చేక్ చేసే ఒక్కే ఒక్క హీరో ఇతడే..!

Thota Jaya Madhuri
ప్రభాస్ .. ఓ రెబల్ స్టార్. పాన్ ఇండియా స్టార్. చాలా రిజర్వ్డ్ గా ఉంటారు . ఎవరితోనూ ఎక్కువగా రాసుకొని పూసుకొని మాట్లాడడు. ఆయనతో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసే వాళ్లకు మాత్రమే ఆ విషయం తెలుసు. ఆయన బాగా మొహమాట పడకుండా మాట్లాడేది  ముగ్గురితోనే.  వాళ్ళలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ..అయితే మరొక వ్యక్తి రామ్ చరణ్ అలాగే మరొక వ్యక్తి గోపిచంద్ . ఇలా ప్రభాస్ కొంతమందితో మాత్రమే చాలా క్లోజ్ గా ఉంటారు మాట్లాడతారు.


అయితే ప్రభాస్ ఓ వ్యక్తితో మాత్రం చాలా చనువుగా మూవ్ అవుతూ ఉంటారు . ఎంతలా అంటే అన్ని విషయాలలో చాలా స్ట్రిక్ట్ గా పద్ధతిలు పాటించే ప్రభాస్ ఆ వ్యక్తి పక్కనుంటే మాత్రం చాలా అల్లరి అల్లరిగా నాటి నాటిగా బిహేవ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా ఆయన ఫోన్ తీసుకొని మరి ఫోన్ లోపల ఉండే ఫొటోస్ మెసేజెస్ కూడా చెక్ చేసే అంత చనువు. ఆ వ్యక్తితో ప్రభాస్ కి స్పెషల్ బాండింగ్ కూడా ఉంది . ఆయన మరెవరో కాదు "గోపీచంద్".


గోపీచంద్ - ప్రభాస్ ఎంత మంచి స్నేహితులు అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు - హీరోయిన్లు - డైరెక్టర్లు ఫ్రెండ్షిప్ చేసుకున్న విషయం మనకు తెలుసు . కానీ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ మాత్రం అంతకుమించిన రేంజ్ లోనే ఉంటుంది.  చాలా చనువు గా ఉంటారు.  ఒకరి విషయాలు ఒకరు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా స్టేజిపై చాలా సిగ్గు సిగ్గుగా బిడియం గా ఉండే ప్రభాస్ ..గోపీచంద్ పక్కన ఉంటే మాత్రం ఆయనలోని లోని ఎనర్జీ లెవల్స్  వేరే లెవెల్ లో ఉంటూ  తన నాటినెస్ ను బయట పెడుతూ ఉంటాడు. అంత మంచి ఫ్రెండ్స్ గోపీచంద్ - ప్రభాస్. గోపీచంద్ - ప్రభాస్ హీరో - విలన్ గా వర్షం సినిమా వచ్చింది . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో సినిమానే రాలేదు.  వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా రావాలి అంటూ కోట్లాదిమంది రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో అలాంటి ఆఫర్ ఇచ్చిన విలన్ పాత్రలు చేయకూడదు అంటూ గోపీచంద్ రిజెక్ట్ చేశారు . ఇక వీళ్లిద్దరిని కలిపి సినిమా తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో చూడాలి..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: