ఈ "అమరన్" మూవీ తెలుగులో మన హీరో చేసుంటేనా..? 100 కోట్లు పక్క..నో డౌట్..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్  సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా  పలు విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు . ఎంత ఓపెన్ గా అంటే ఈ సినిమా మీకు బాగుంటుంది ..ఈ సినిమా మీకు బాగోదు.. ఈ రోల్లో మీరు బాగా నటించారు.. ఈ రోల్లో మీ పర్ఫామెన్స్ చాలా దరిద్రంగా ఉంది ..నికృష్టంగా ఉంది ..మీకు అంతా సీన్ లేదు అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో "అమరన్" సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది .


మనకు తెలిసిందే పెరియ స్వామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన సినిమా "అమరన్". మెజర్ "ముకుంద్  వరదరాజ్" జీవిత ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కించారు డైరెక్టర్. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ , టీజర్స్ అన్నీ అప్ డేట్శ్ కూడా అభిమానులు బాగా ఆకట్టుకున్నాయి . దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది .


మరీ ముఖ్యంగా సాయిపల్లవి పలికించిన ఎక్స్ప్రెషన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి . ఆమెను తెరపై చూస్తూ ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్ ఇంత కష్టపడుతుందా..? ఇంత బాధ పడుతుందా..? దేశం కోసం ఇన్ని శాక్రిఫైజులు చేస్తుందా..? అంటూ ప్రతి ఒక్కరూ అనుకునేలా చాలా రియలిస్టిక్  గా సీన్లు తెరకెక్కించాడు డైరెక్టర్ . అయితే ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు జనాలు ఒక విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు . తెలుగు హీరో "సత్యదేవ్" ఈ సినిమాలో హీరో ప్లేస్ లో నటించి ఉంటే ఇంకా బాగుండేది అని ..ఈ పాత్రకు ఆయన బాగా సూటై ఉండేవాడు అని ..శివ కార్తికేయన్ కోలీవుడ్లో స్టార్ కి అయినప్పటికీ తెలుగు జనాలకి పెద్దగా పరిచయం ..ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు అని.  అదే తెలుగులో మన హీరో సత్యదేవ్ చేసుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది అని ..100 కోట్లు కలెక్ట్ చేసి ఉండేది అని..శివ కార్తికేయం ఆ పాత్రకు ప్రాణం పోసిన్నట్లు నటించినా ..ఆ రోల్ లో సత్యదేవ్ అయితే ఇంకా తెలుగు జనాలకి బాగా రీచ్ అయి ఉండేది అని జనాలు అభిప్రాయపడుతున్నారు . ఏ మాటకు ఆ మాట జనాల ఒపీనియన్ కరెక్టే . సత్యదేవ్ అలాంటి పాత్రలో కనిపించి ఉంటే ఆయన కెరియర్ కి బిగ్గెస్ట్ ప్లస్ గా మారుండేది జస్ట్ మిస్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: