ఇదే విడ్డూరంరా బాబు.. మహేష్ కు నచ్చిని సినిమా.. భార్య నమ్రతకు ఎంతో ఇష్టమట..!

Amruth kumar
అవును ఇప్పుడు చేప్ప‌బోయే విష‌యం అంద‌రికి ఆశ్చర్యం కలిగించే విషయం అని చేప్ప‌వ‌చ్చు .. మహేష్ బాబు నటించిన డిజాస్టర్ సినిమాలలో మహేష్ కే నచ్చని ఓ సినిమా అయ‌న భార్య నమ్రతకు ఎంతో ఇష్టమట .. ఇన్నీ ఏళ్ల మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి . మహేష్ నటించిన చివరి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి .. ప్రస్తుతం మహేష్ తన 29వ సినిమాను రాజమౌళితో చేబోతున్నాడు. సినిమా కోసం రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది .ఇక మహేష్ నమ్రతను పెళ్లాడాక తన లైఫ్ స్టైల్ కెరీర్‌ను చాలా వరకు మార్చేసింది. ఇక మహేష్ నమ్రత మధ్య ప్రేమ పుట్టేలా చేసిన సినిమా వంశి.. ఈ సినిమాను కృష్ణ తన సొంత బ్యానర్ అయిన పద్మాలయ స్టూడియోస్ పై స్వయంగా నిర్మించాడు..

ఈ సినిమాలో నమ్రత హీరోయిన్గా నటించింది. 2000 సంవత్సరం అక్టోబర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది . అయితే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరిగే స‌మ‌యంలో మహేష్ - నమ్రత మధ్య ప్రేమ చిగురించిందట .ఆ సినిమా షూటింగ్ దగ్గర నుంచి నాలుగు సంవత్సరాలకు పైగా ప్రేమించుకున్న ఈ జంట 2005 లో ముంబైలో వీరు వివ‌హం చేసుకున్న‌రు .. ఇక మహేష్ తన సినీ కెరియర్లో బాగా డిస్టర్బ్ చేసి పరువు తీసిన సినిమాలు బాబీ - బ్రహ్మోత్సవాన్ని అంటారు. కానీ మహేష్ కు మాత్రం వ్యక్తిగతంగా పరువు తీసిన సినిమా వంశీ .. తన తండ్రి కృష్ణతో కలిసి నటించడం, అదేవిధంగా తన సొంత బ్యానర్, తన భార్య నమ్రతతో ప్రేమ చిగురించిన సినిమా వంశి డిజాస్టర్ అవ్వటం మహేష్‌ను ఎంతగానో బాధించింది.

ఇక క‌థ కూడా రెడీ కాకుండా హ‌డావిడిగా సినిమా చేసేశారు. ద‌ర్శ‌కుడు బి.గోపాల్ అదే స‌మ‌యంలో బాల‌య్య‌తో న‌ర‌సింహానాయుడు చేస్తూ ఆ సినిమాపై ఎక్కువ ఫోక‌స్ చేయ‌డం వ‌ళ్ళే వంశీ ప్లాప్ అవ్వ‌డానికి కార‌ణ‌మ‌ని టాక్ ఉంది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు కూడా మ‌హేష్‌కు సినిమా తేడా కొడుతుంద‌ని అర్థ‌మైపోయింద‌ట‌. రిలీజ్ అయ్యాక మ‌హేష్ జోస్యం నిజ‌మై సినిమా ప్లాప్ అయ్యింది.  క‌నీసం ఆర్టిస్టుగా కూడా మ‌హేష్‌కు ఏ మాత్రం సంతృప్తి క‌లిగించ‌ని సినిమాగా వంశీ రికార్డుల‌కు ఎక్కింది . అయితే ఈ ప్లాప్ సినిమాయే న‌మ్ర‌త‌కు బాగా ఇష్టం అట‌. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్నంత సేపు న‌మ్ర‌త ఎంజాయ్ చేస్తూ సినిమా చేయ‌డం.. అదే టైంలో మ‌హేష్‌తో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌డంతో  ఆ మెమ‌ర‌బుల్ మూమెంట్స్ ఆమెకు బాగా గుర్తుండిపోయాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: