ఒత్తిడి వెంటాడుతోందా...? బయటపడే సింపుల్ టెక్నిక్స్ ఇవిగో!
ఎందుకంటే కొందరు సమస్య చిన్నదైనా అదిగా ఆలోచిస్తుంటారు. దీంతో బాడీలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. రాత్రులు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఏకాగ్రత దెబ్బ తినడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ధ్యానం, యోగా, మెడిటేషన్, హెర్బల్ మసాజ్ థెరపి వంటివి మీలో రిలాక్సేషన్ కలిగిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశ్రమణం పొందుతారు. మీరు ఎక్కువగా స్ట్రెస్కో గురవుతుంటే గనుక కొంతకాలం చక్కెర, టి , కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోవటం తగ్గించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటివల్ల మీలో ఆందోళన మరింత పెరుగుతుంది.
అదికా బరువు కారణం అవుతుంది. అవకాడో, చిక్కుళ్లు, గుమ్మడి గింజలు, అరటిపండు వంటివి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల వీటిలోని మెగ్నీషియం, పొటాషియం స్థాయిలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు మీ ప్రియమైన వారితో మాట్లాడడం, బాధలు, సమస్యలు పంచుకోవడం వల్ల కొంత రిలాక్స్ అవుతారు. అయితే మీ సమస్యను విని అర్థం చేసుకునే వారితో మాత్రమే విషయాలు షేర్ చేసుకోండి. అలాకాకుండా ప్రతికూలతను పెంచే వ్యక్తులైతే మరింత ఒత్తిడి, నిరాశ, నిస్పృహ పెరిగిపోవచ్చు. దీంతోపాటు మీలో ఉత్సాహం కలిగించే పనులు, ప్రకృతిని ఆస్వాదించడం, బుక్స్ చదవటం వంటివి కూడా ఉపశ్రమమం కలిగిస్తాయి.