నిజామాబాద్, అనంతపురం.. పేరు చివర్లో బాద్, పురం ఎందుకు.. వాటి అర్థమేంటో తెలుసా?

praveen

సాధారణంగా కొన్ని ఊరిపేర్లనేవి కొత్తగా వినేవారికి చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. మీది ఏవూరు? అని అడిగినపుడు, మనం చెప్పినపుడు చాలామంది నవ్వుతూ ఉంటారు. అలాగే వారి ఊరు పేర్లు చెప్పినప్పుడు కూడా మనకి అలాంటి అనుభవమే కలుగుతుంది. ఇక ఇంటిపేర్ల సంగతి గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. అయితే అది ఇప్పుడు అప్రస్తుతం కానీ, ఇక్కడ ఊర్లపేరు గురించే చర్చ. అయితే ప్రతి ఉరి పేరు వెనకాల ఏదోఒక చరిత్ర దాగి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల పేర్లు అయితే, మరొక ప్రాంతంలో బూతుగా వినబడుతుంది. ముఖ్యంగా రాష్ట్రాలు దాటినపుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఊరి పేర్ల చివర వచ్చే పదాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఉదాహరణకి నిజామాబాద్, అనంతపురం.. పేరు చివర్లో బాద్, పురం ఎందుకు వచ్చాయి? అనే దానిపైన అపుడపుడు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇపుడు వాటిగురించి తెలుసుకుందాం. ఇక్కడ నిజామాబాద్ లోని 'బాద్' గురించి చూసుకుంటే, ఇది ఆబాద్ అనే పదం నుండి వచ్చిందిగా కనబడుతోంది. ఇక్కడ అబాద్ అంటే నివాసయోగ్యానికి అనువైన స్థలం అని అర్ధం. వాటిని స్థాపించవారు లేదా ప్రముఖుల పేర్లకు చివరన ఇలాంటి పేర్లు చేరుస్తారు. అదేవిధంగా అనంతపురం అనేపదంలో 'పురం' అనగా ఏమిటంటే, పట్టణం అని అర్ధం. ఇలా చూసుకుంటే మనకి అనేకం కనిపిస్తాయి.
ఇక విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల పేర్లు గమనిస్తే, సింథియా అని ఒక ప్రాంతానికి పేరు. సింథియా అనగా  గ్వాలియర్ మహారాజా వారి పేరు. ఆయన నుండి కొనుగోలు చేసిన ఓడలతో వాల్ చంద్ హీరాచంద్ అనే వ్యాపారస్తుడు "శేఠు సింథియా స్టీమ్ నేవిగేషన్" కంపెనీ అనే సంస్థను స్థాపించాడు. ఒకప్పుడు ఈ కంపెనీ ఉన్న ప్రాంతమే ఇప్పుడు సింథియాగా మారింది. అదేవిధంగా గాజువాక అని ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ వాక అంటే వాగు అని అర్ధం. ఒకప్పుడు ఈ ప్రాంతం వాగులకు ప్రసిద్ధి. విజయనగరం, బొబ్బిలి సంస్థానాలకు చెందిన ఏనుగులకు (గజములు) ఒకప్పుడు ఇది విడిది కేంద్రం. ఈ వాగులలోనే ఏనుగులను స్నానం చేయించడానికి, నీళ్లు తాగించడానికి సైనికులు తీసుకొచ్చేవారు. అందుకే ఇది గాజువాకగా ప్రసిద్ధి చెందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: