అణ్వస్త్ర పరీక్షలు మొదలు పెట్టిన పుతిన్..? ఉక్రెయిన్ లొంగిపోక తప్పదా..?

ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్న వేళ రష్యాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ అణు బలగాలు ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆదేశాలు అందడంతో ఈ స్పెషల్ డ్రిల్స్‌ ని షురూ చేశారు. ఈ పరిణామంపై రష్యాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత సంక్లిష్టమైన దశ వచ్చిందని వ్యాఖ్యానించారు.


కాగా గత 15 రోజుల వ్యవధిలో పుతిన్ ప్రారంభించిన రెండవ సైనిక కసరత్తు కావడం గమనార్హం. అయితే అంతకంతకూ పెరిగిపోతున్న ఈ ఉద్రిక్తతను ఎలా తగ్గించాలో తెలియక పశ్చిమ దేశాల నేతృత్వంలోని నాటో (NATO) కూటమి తలపట్టుకుంటోంది.


రష్యాలోని సుదూర భూభాగాలను సైతం తన లక్ష్య పరిధిలోకి తెచ్చుకునేలా ధీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించేలా ఉక్రెయిన్‌కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల దళాలు యోచిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతలకు ఈ పరిస్థితే కారణంగా ఉంది. పాశ్చాత్య దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఎలాంటి దాడికైనా పాల్పడితే దేశ రక్షణ కోసం తన అణ్వాయుధాలను ఉపయోగించడాన్ని పరిశీలిస్తామని రష్యా ఇప్పటికే హెచ్చరించింది.


కాగా రష్యా గత నెలలో అణ్వాయుధాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. అణ్వాయుధేతర దేశాలపై కూడా అణ్వస్త్రాలను ఉపయోగించడానికి అనుమతించేలా మార్పులు తీసుకొచ్చారు. అందుకే పశ్చిమ దేశాలను రష్యా హెచ్చరించింది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో అణ్వాయుధాల వినియోగాన్ని పరిశీలిస్తున్నారు.


బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో అణ్వాయుధాల వినియోగాన్ని రష్యా పరీక్షిస్తుంది. ఇందులో భాగంగా.. మూడు అణ్వాస్త్రాలను పరీక్షించిన పుతిన్ సైన్యం జలాంతర్గముల నుంచి రెండు రాకెట్ల ప్రయెగం చేయగా.. భూ ఉపరితలం నుంచి మరో బాంబ్ ను ప్రయోగించింది. వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ… భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఉక్రెయిన్, ఇతర దేశాల బెదిరింపుల దృష్ట్యా ఆధునిక, తక్షణమే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న శక్తులను ఉపయోగించడం అత్యంత ముఖ్యమని అన్నారు. మొత్తం మీద రష్యా అణ్వాస్త్ర పరీక్షల మీద ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: