పుష్ప-2: థియేటర్ కు షోకాజ్ నోటీసులు..త్వరలో 'సంధ్య' చాప్టర్ క్లోజా.?

FARMANULLA SHAIK
పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ పోలీసులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. పుష్ప - 2 ప్రిమియర్ షో సందర్భంగా తొక్కిసలాట ఘటన లో పోలీసులు 12 లోపాలు గుర్తించారు.దీనిపై 10 రోజుల్లో గా వివరణ ఇవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో థియేటర్‌ యాజమాన్యం విఫలమైందన్నారు. థియేటర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయింది.ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.థియేటర్లో గల లోపాలను ఇలా పేర్కొన్నారు.ప్రధాన నటుల రాక గురించి పోలీసులకు తెలియజేయలేదు.ప్రవేశ ద్వారం వద్ద ఒకే డీఎఫ్ఎండీ తో సహా తగినంత భద్రత, జన సమూహ నియంత్రణ చర్యలు చేపట్టలేదు.ప్రవేశ, నిష్క్రమణ కోసం సరైన సంకేతాలు లేవు. ఇది గందరగోళానికి దారితీసింది. 

థియేటర్ వెలుపల అనధికారికం గా ఫ్లెక్సీలు, ట్రస్సులు, లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల క్రౌడ్ ఎట్రాక్ట్ అయ్యారు.దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, దిగువ బాల్కనీ గేట్ జనసమూహ ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది.టికెట్ ధృవీకరణ వ్యవస్థ లేదు, అనధికార ప్రవేశం.అధిక రద్దీ కి కారణమైంది.పార్కింగ్ ఏర్పాట్లు సరిపోక ప్రధాన ద్వారాల వద్ద జనసమూహం పెరిగింది.ప్రైవేట్ భద్రతా సిబ్బంది ప్రజా మార్గాలను నిరోధించడానికి అనుమతించారు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఇలా చాలా సమస్యలు ఉన్నట్లు ప్రకటించారు. మూవీ టీం వస్తుందని పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడం పై పోలీసులు గుర్రుగా ఉన్నారు. ఎంట్రీ,ఎగ్జిట్ వివరాలు టికెట్ వెరిఫికేషన్ సిస్టం లేకపోవడం, భారీ స్థాయి లో ఫ్లెక్సీలు, పార్కింగ్ సమస్య ఇలాంటి అనేక సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: