పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. దాదాపు 5 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ వచ్చింది.పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. దాదాపు 5 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ వచ్చింది.పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. దాదాపు 5 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ వచ్చింది.రామ్ మరోసారి ఎనర్జీ చూపించాడు. క్యారెక్టర్ కోసం కష్టపడ్డాడు. పాటల్లో డాన్సులు అదిరిపోయాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. సంజయ్ దత్ జస్ట్ ఓకే.. కావ్య తపర్ పూర్తిగా గ్లామర్ కే పరిమితమైంది. గెటప్ శ్రీను ఉన్నంతవరకు బాగానే చేశాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.కానీ సినిమా బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు.సీక్వెల్ కూడా అయినా కథ బాగుంటే సీక్వెల్ వర్కవుట్ అవుతుంది కానీ బ్రాండ్ నేమ్ తో కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు పూరి జగన్నాథ్. ఐదేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు మొదట యావరేజ్ టాక్ వచ్చినాకూ డా పరిస్థితులు అన్నీ కలిసి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. నాకు నచ్చలేదు.రామ్ ఎనర్జీ, పాటలు వర్క్ అవుట్ అవ్వడంతో సినిమా రేంజ్ మారిపోయింది.
మళ్లీ అదే కథను సేమ్ టెంప్లేట్ లో వేసుకుని డబుల్ ఇస్మార్ట్ తీశాడు పూరి. సంబంధం లేని సన్నివేశాలు, కామెడీ కోసం రాసిన ట్రాక్ లు హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ఇవన్నీ చూస్తుంటే పూరీలోని రైటర్ ఇంత దిగజారిపోయాడా అని బాధనిపించింది. అలీ ట్రాక్ అయితే మరీ దారుణం.. కథకు సంబంధమే లేని కామెడీ కానీ కామెడీ ఇది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు రెండూ రెండే దొందు దొందే చాలా వరకు సీన్స్ ల్యాగ్ అనిపించాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని సీన్స్ రాసుకున్నాడు కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ లో కనీసం కొన్ని కామెడీ సీన్స్ తో పాటు, పాటలు బాగుంటాయి. ఇందులో అలా గుర్తు పెట్టుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు. ఏదో ఒక సినిమా చేయాలి అన్నట్టు చేసాడే కానీ.. కాన్సట్రేట్ చేసి తీసినట్టు ఎక్కడా అనిపించలేదు. పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఊహించడం కాస్త కష్టమే. కానీ ఎందుకో సంబంధం లేని సన్నివేశాలు చాలా రాసుకున్నట్టు అనిపించాయి.ఇదిలాఉండగా 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.2024లో విడుదలైన డబుల్ ఇస్మార్ట్ విమర్శకుల నుండి ప్లాప్ ను అందుకుంది.ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఊహించని రిజల్ట్ ఎదురైంది. డబుల్ ఇస్మార్ట్ మూవీ అదే రొటీన్‌గా సాగింది, కొత్తగా కథా కథనం ఏం లేవని నెగెటివ్ టాకక్ బాగానే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రిలీజ్ అయింది.