మెగాస్టార్ చిరంజీవి తల్లి ఇష్టపడే హీరో ఎవరంటే? కొడుకులను గట్టిగానేే ఇరికించిందిగా..!

Amruth kumar
ముందు తాను ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్లో అన్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఏఎన్నార్ జాతీయ అవార్డుల‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ అవార్డును ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కడ తన తల్లి అంజనా దేవికి నాగేశ్వరావు గారు అంటే ఎంతో ఇష్టమని ఆయన అన్నారు. అలాగే తన తల్లి గర్భిణీ గా ఉన్న సమయంలో మొగల్తూరులో నాగేశ్వరరావు గారి సినిమా విడుదలైంది. ఆ స‌మ‌యంలో మొగల్తూరు నుంచి నర్సాపూర్ కు జట్కా బండి లో కూర్చుని మా అమ్మ ఆ సినిమాకు వెళ్ళి.. ఇక్కడ కింద పడిపోయింది.. ఆ సమయంలో మా తండ్రిగారు ఎంతో కంగారు పడిపోయారు.

ఇక సినిమా ఎందుకు  ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమాకు వెళ్లి చూసి వచ్చిందని ఆ తర్వాత రెండు నెలలకు తాను పుట్టానని చిరంజీవి చెప్పుకోవచ్చాడు.. అలాగే తన తల్లి ఏఎన్నార్ సినిమాలను ఎంత ఇష్టపడతారో గుర్తుతెచ్చుకున్నారు. ‘అలా వారసత్వంగా తనకు కూడా అక్కినేనిపై అభిమానం వచ్చినట్టుంది’ అంటూ చిరు మరో కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆయన స్పీచ్ ఇస్తున్న టైం లో అక్కినేని నాగేశ్వరరావు అనడానికి బదులు ఎన్టీఆర్ అనేశారు. వెంటనే సారీ చెప్పేసి మహానుభావుడు ఆయన పేరు కూడా గుర్తు రావడం శుభ పరిణామం అంటూ కవర్ చేసి, తర్వాత ఏఎన్ఆర్  నామస్మరణ చేశారు చిరు

ఏఎన్నార్ స్టెప్ లంటే ...త‌న‌కు ఎంతో ఇష్టమని అన్నారు. ఫిలిం ఇండ్రస్ట్రీలో డ్యాన్స్ లు వేయడానికి తాను ఆద్యుడినయితే , అందులో స్పీడ్, గ్రేస్ ను పెంచింది చిరంజీవి అంటూ ఏఎన్నార్ తనను ఒక ఇంటర్వ్యూలో ప్రశంసించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు ఏఎన్నార్ అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన తండ్రి కూడా తన సినిమాలను చూసి ప్రశంసించేవారని , అయితే తన ముందు తనను మాత్రం అభినందించేవారు కాదని, తనకు ఆయుక్షీణమని చెప్పి ఆయన తన సినిమాలు బాగున్నా ఆయన పెద్దగా స్పందించేవారు కారని అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: