హవ్వ..అందరి ముందే శోభిత తో అలాంటి పని.. ఈ నాగచైతన్య వేషాలు మాములుగా లేవే..!
మరీ ముఖ్యంగా స్టేజ్ పైకి వచ్చిన చిరంజీవి.. ఏఎన్ఆర్ గురించి మాట్లాడిన మాటలు అందరికీ కన్నీళ్లు వచ్చేలా చేశాయి . అంతేకాదు ఏఎన్ఆర్ ఐసీయూ లో ఉన్నప్పుడు ఆయన చివరిగా మాట్లాడిన మాటలు తాలూకా వీడియో కూడా అందరిని కన్నీళ్లు పెట్టుకునేలా చేశాయి . కాగా ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అదేవిధంగా కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఇద్దరు కూడా ఈ ఈవెంట్లో జంటగా కనిపించడం అక్కినేని అభిమానులకు బాగా నచ్చేసింది.
అంతేకాదు ఇదే ఈవెంట్లో నాగచైతన్య -శోభిత కి సంబంధించిన ఒక వీడియో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో నాగచైతన్య పదేపదే శోభిత ధూళిపాళ్లను పట్టుకోవడం.. వెనుక నుంచి తాకుతూ ఉండడం ..ఆమె చేయి వదలకుండా ఉండడం చూడొచ్చు. అయితే ఇది పెద్దగా వల్గర్ గా లేకపోయినప్పటికీ కావాలనే కొంతమంది అక్కినేని నాగచైతన్య పై మండిపడుతున్నారు . "కాబోయే భార్యగా.. ఎందుకు అప్పుడే అంత తొందర..ఇక నీ పక్కనే ఉంటుంది గా "అంటూ డబల్ మీనింగ్ డైలాగ్స్ తో ట్రోల్ చేస్తున్నారు . కాగా డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరగబోతుందట..!!